Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నడుస్తున్నప్పుడు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోందా..? కీళ్లు పట్టేసినట్లు అనిపిస్తున్నాయా..? ఉదయం నిద్రలేవగానే మోకాళ్లు బిగుసుకుపోయి, లేచి నిలబడటానికి ఇబ్బందిగా ఉంటుందా..? నడిచేటప్పుడు మోకాళ్ల నుంచి కటకట శబ్దాలు వస్తున్నాయా..? అయితే, మీరు వెంటనే అప్రమత్తం కావాల్సిందే. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే ఈ కీళ్ల నొప్పుల సమస్య.. నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసు వారిని కూడా తీవ్రంగా వేధిస్తోంది. మోకాళ్లలో జిగురు తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

మోకాళ్లలో ‘జిగురు’ (Synovial Fluid) అంటే ఏమిటి..?

మన శరీరంలోని ప్రతి కీలు మధ్య ఒక ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది. దీనిని వైద్య పరిభాషలో 'సైనోవియల్ ఫ్లూయిడ్' (Synovial Fluid) అని పిలుస్తారు. వాహనంలోని భాగాలకు ఆయిల్ లేదా గ్రీజు ఎలా పనిచేస్తుందో, మన కీళ్లకు ఈ ద్రవం అలా పనిచేస్తుంది. ఇది కీళ్ల మృదువైన కదలికలకు సహాయపడటమే కాకుండా, ఎముకలు ఒకదానికొకటి రాసుకోకుండా అడ్డుకుంటుంది.

ఈ ద్రవం ఎందుకు తగ్గుతుంది..?

వయసు పైబడటం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, గతంలో దెబ్బలు తగలడం లేదా ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis) వంటి కారణాల వల్ల కీళ్ల మధ్య ఈ ద్రవం క్రమంగా తగ్గిపోతుంది.ఎముకల చివరన ఉండే మృదువైన పొరను కార్టిలేజ్ (Cartilage) అంటారు. సైనోవియల్ ద్రవం తగ్గినప్పుడు ఎముకల మధ్య రాపిడి పెరిగి, ఈ కార్టిలేజ్ అరిగిపోతుంది. దీనివల్లే విపరీతమైన నొప్పి వస్తుంది.

ఎవరిలో ముప్పు ఎక్కువ..?

50 ఏళ్లు పైబడిన వారు, మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అధిక బరువు ఉన్నవారు, భారీ బరువులు ఎత్తేవారు, మధుమేహం, విటమిన్-డి లోపం ఉన్నవారు కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది.

ఆహారంతోనే అద్భుతమైన ఉపశమనం..!

మోకాళ్లలో జిగురు తగ్గుతోందని కంగారు పడాల్సిన అవసరం లేదు. సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడంతో పాటు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను సులభంగా జయించవచ్చు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..

వాల్‌నట్స్ , అవిసె గింజలు (Flaxseeds) ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాల్షియం, విటమిన్ డి..

 ఎముకల పటిష్టతకు ఇవి చాలా కీలకం. పాలు, పెరుగుతో పాటు ఆకుపచ్చని కూరగాయలను ప్రతిరోజూ తీసుకోవాలి.

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ నూనె శరీరంలోని వాపులను (Inflammation) తగ్గించడంలో, కీళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతుంది.

ప్రోటీన్లు..

మృదులాస్థి (cartilage), కండరాలు దృఢంగా ఉండటానికి తగిన మోతాదులో ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే సొంత వైద్యం మానుకుని, వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.