Risk of Arthritis : కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..? ఆర్థరైటిస్ ముప్పును ఇలా జయించండి..!
సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే కీళ్లు పట్టేయడం, మెట్లు ఎక్కలేకపోవడం, కాస్త నడవగానే మోకాళ్ల నొప్పులు రావడం.. ఇవన్నీ కేవలం వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే సమస్యలని అనుకుంటే పొరపాటే. ఆధునిక జీవనశైలి కారణంగా నేటి యువత, చిన్న పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ (arthritis) సమస్యలు ఎక్కువవుతున్నాయి.
నొప్పులు ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చాలామంది అపోహ పడు తుంటారు. కానీ, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కీళ్ల సమస్యలు మరింత జటిలం అవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థరైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..
ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్నెస్ మీ సొంతం..!
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
చురుకుదనమే అసలైన మందు..
ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు సరైన పద్ధతిలో యోగా, వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలా అని జిమ్‌కి వెళ్లి బరువైన ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు. తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్ వల్ల కీళ్ల కదలికలు మెరుగుపడతాయి.
ఏ వయసు వారైనా.. చిన్న వయసు నుంచే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటే భవిష్యత్తులో ఎముకల సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్..
రోజూ వ్యాయామం చేయడం వల్ల కేవలం కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా.. మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.
ఏరోబిక్ వ్యాయామాలు ఎంతో మేలు..
కీళ్ల నొప్పులను నివారించడంలో ఏరోబిక్ వ్యాయామాలు అద్భుతంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వేగంగా నడవడం (brisk walking), సైక్లింగ్, స్విమ్మింగ్ (swimming), డ్యాన్సింగ్ వంటివి ఇందులో భాగం. ఇవి కండరాలను, ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మానసిక ఉల్లాసానికి కూడా ఇవి ఎంతో దోహదపడతాయి.
ఆహార నియమాలు.. బరువుపై నియంత్రణ..
ఆర్థరైటిస్‌ను జయించడానికి కేవలం మందులు, వ్యాయామం మాత్రమే సరిపోవు. మనం తీసుకునే ఆహారం కూడా కీళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు..అవిసె గింజలు (Flaxseeds), వాల్నట్స్, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు తరచుగా తీసుకోవాలి. ఇవి శరీరంలో వాపులను (Inflammation) తగ్గించడంలో సహాయపడతాయి.
రంగురంగుల పండ్లు, కూరగాయలు..యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గడం ముఖ్యం..
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు అధిక బరువు ఉంటే.. కీళ్లపై అదనపు భారం పడుతుంది. కాబట్టి క్యాలరీలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్, తీపి పానీయాలకు (Sugary drinks) వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కీళ్ల నొప్పులు దీర్ఘకాలంగా వేధిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా, సరైన ఆర్థోపెడిక్ వైద్యుడిని లేదా ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు వ్యాయామాలు, చికిత్స తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
