తాజా అధ్యయనం : డెంగ్యూ రోగులకు మేకపాలు నిజంగా ప్లేట్‌లెట్స్‌ను పెంచుతాయా..?
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో దోమల బెడదతో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితే మేక పాలు తాగితే పెరుగుతాయనే ఒక అపోహ (Myth) జనాల్లో బలంగా ఉంది. అయితే, ఈ సంప్రదాయ చికిత్స ఎంతవరకు నిజం? మేకపాలు నిజంగా ప్లేట్‌లెట్స్‌ను పెంచుతాయా? లేదా పరిస్థితిని మరింత దిగజార్చుతాయా? అనే సందేహాలకు తాజా అధ్యయనం సమాధానం ఇచ్చింది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?
తాజా అధ్యయనంలో..
'క్లినికల్ కేస్ రిపోర్ట్స్'లో ప్రచురించిన తాజా అధ్యయనం డెంగ్యూ రోగులకు మేకపాలు నిజంగా ప్లేట్‌లెట్స్‌ను పెంచుతాయనే అపోహపై క్లారిటీ ఇచ్చింది. ఇది ఎంతమాత్రం నిజం కాదని తేల్చి చెప్పింది.
నిజం కాదు: మేక పాలు తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
బ్రుసెలోసిస్ ప్రమాదం: దీనికి విరుద్ధంగా, పచ్చిగా (పాశ్చరైజ్ చేయని) మేక పాలు తాగడం వల్ల రోగులు 'బ్రుసెలోసిస్' అనే తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.
ప్లేట్‌లెట్స్ పెరగడం 'సహజంగా జరిగే రికవరీ' మాత్రమే...
డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్స్ సంఖ్యలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే, అది కేవలం రోగి శరీరంలో సహజంగా కోలుకునే ప్రక్రియ వల్ల జరుగుతున్నదే తప్ప, మేక పాలు తాగడం వల్ల కాదని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
