Boost Memory : జ్ఞాపకశక్తిని పెంచే జీవనశైలి మార్పులు..!
సాక్షి లైఫ్ : వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, చేయాల్సిన పనులు అకస్మాత్తుగా గుర్తుకు రాకపోవడం తరచుగా జరుగుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం సహజమే అయినా, జీవనశైలిలో మనం చేసుకునే చిన్నపాటి మార్పులతో మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
కంటి నిండా నిద్ర..
శరీరానికే కాదు, మెదడుకు కూడా విశ్రాంతి ఎంతో అవసరం. పగటిపూట మనం గ్రహించిన సమాచారాన్ని విశ్లేషించి, జ్ఞాపకాలను బలోపేతం చేయడానికి నిద్ర తోడ్పడుతుంది. కాబట్టి రోజూ సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం ఎంతో మేలు.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మెదడుకు పదును..
శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వ్యాయామం ఎంత అవసరమో, మెదడు చురుకుదనాన్ని పెంచేందుకు కూడా కసరత్తులు అంతే ముఖ్యం. సుడోకు, పజిల్స్ సాధించడం, చదరంగం ఆడటం, పుస్తకాలు చదవడం లేదా ఏదైనా కొత్త నైపుణ్యాన్ని భాష,కళ నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్‌గా ఉంటాయి.
పోషకాహారం..
జ్ఞాపకశక్తికి బలమైన ఆహారం చాలా అవసరం. రోజువారీ డైట్‌లో ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. వాల్‌నట్స్, బాదం, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ హెల్త్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. అదే సమయంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, చక్కెర వినియోగాన్ని బాగా తగ్గించాలి.
వ్యాయామం..
శారీరక శ్రమ మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ కనీసం అరగంట పాటు వేగంగా నడవడం, యోగా, లేదా సైక్లింగ్ లాంటివి చేయాలి. ఉద్యోగాల్లో గంటల తరబడి ఒకేచోట కూర్చునేవారు మధ్యమధ్యలో లేచి కాస్త అటూఇటూ నడవాలి.
ఒత్తిడికి చెక్..
దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనల వల్ల ఏకాగ్రత దెబ్బతిని మతిమరుపు పెరుగుతుంది. రోజూ కాసేపు ధ్యానం, బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. ఇష్టమైన సంగీతం వినడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడపడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తీవ్రమైన మతిమరుపు లక్షణాలు ఉండి, రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంటే మాత్రం ఈ చిట్కాలపైనే ఆధారపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
