సాక్షి లైఫ్ : నేటి యువతలో గుండె జబ్బుల (Heart Diseases) కేసులు వేగంగా పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయస్సు వారికి మాత్రమే పరిమితమైన గుండెపోటు, ఇప్పుడు 40 ఏళ్ల లోపు వారినీ కబళిస్తోంది. ఈ అనూహ్య మార్పునకు గల కారణాలు, ప్రమాదాన్ని పెంచుతున్న జీవనశైలి అలవాట్లపై ప్రముఖ కార్డియాలజిస్టులు కీలక విషయాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సాక్షి లైఫ్ స్పెషల్ స్టోరీ..
యువతలో పెరుగుతున్న ఈ ముప్పును గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
యువతలో గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే..
-జీవనశైలి మార్పులు, శారీరక సమస్యలు (Lifestyle & Metabolic Issues)
యువతలో గుండె సమస్యలు పెరగడానికి ముఖ్య కారణాలు... ఊబకాయం (Obesity), అధిక రక్తపోటు (High Blood Pressure), ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) వేగంగా పెరుగుతుండటమే. మారుతున్న జీవనశైలి కారణంగా వృద్ధాప్యంలో వచ్చే ఈ సమస్యలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల యువతలో చిన్న వయసులోనే ప్రారంభమవుతున్నాయి.
-ఒత్తిడి (Stress)..
నేటి పట్టణ వాతావరణంలో ఒత్తిడి ఒక మహమ్మారిగా మారింది. పని ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా దీర్ఘకాలిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ ఒత్తిడి కారణంగా:
అధిక రక్తపోటు (High Blood Pressure)
డిస్లిపిడెమియా (అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు)
రక్తనాళాలు దెబ్బతినడం (Endothelial Damage) వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
-చెడు ఆహారపు అలవాట్లు, వ్యసనాలు (Diet and Vices)
అనారోగ్యకరమైన ఆహారం: అధిక శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు (Refined Carbohydrates), చక్కెర మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం.
శారీరక శ్రమ లేకపోవడం..
వ్యసనాలు: యువతలో ధూమపానం(smoking), వేపింగ్ (Vaping), అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లు గుండెపోటు ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతున్నాయి.
-కోవిడ్ అనంతర ప్రభావం (Post-COVID Effects)..
కోవిడ్-19 నుంచి కోలుకున్న చాలా మంది రోగులలో వైరస్ కారణంగా ఏర్పడిన వాపు (Residual Inflammation), మైక్రోవాస్కులర్ డ్యామేజ్ లేదా రక్తం గడ్డకట్టే లోపాలు (Clotting Disorders) వంటి సమస్యలు గుండె సంబంధిత ప్రమాదాలను వేగవంతం చేస్తున్నాయి.
నిర్లక్ష్యం కూడా కారణమే..!
యువత తరచుగా అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుండటం కూడా సమస్య తీవ్రత పెరగడానికి ఒక ముఖ్య కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అలసట, శ్వాస తీసుకోవడంలో కొద్దిపాటి ఇబ్బంది లేదా ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలను కూడా వారు ఒత్తిడి లేదా అలసటగా భావించి విస్మరిస్తుంటారు. పరిస్థితి తీవ్రమయ్యే వరకు వైద్యుడిని సంప్రదించకపోవడం వల్ల కొన్నిసార్లు చికిత్స అందించడం కష్టమవుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com