దోమల నివారణకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతపైనా శ్రద్ధ వహించాలి. పరిసరాల పరిశుభ్రత: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండే డబ్బాలు, పూల కుండీలు, పాత టైర్లలోని నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. డ్రైనేజీ కాలువలు, నీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలి, మూతలు గట్టిగా మూసి ఉంచాలి.
ఇది కూడా చదవండి..కాలేయానికి ఎలాంటి ఫుడ్స్ స్నేహితులు, ఎలాంటి ఫుడ్స్ శత్రువులు..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
దోమల నివారణకు..
సాయంత్రం వేళల్లో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
దోమ తెరలు వాడటం ఉత్తమం. దోమల మందులు, కాయిల్స్, లిక్విడ్ వెపరైజర్స్ ఉపయోగించవచ్చు. అయితే, వీటిని వాడేటప్పుడు గాలి, అలెర్జీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వేపనూనె, యూకలిప్టస్ నూనె వంటి సహజ వికర్షకాలను చర్మంపై రాసుకోవాలి.
ఇంట్లో వేప ఆకులతో పొగ వేయడం, కర్పూరం వెలిగించడం దోమల బెడదను కొంతమేర తగ్గిస్తుంది.
లెమన్‌గ్రాస్, లావెండర్, బంతిపూలు, తులసి వంటి మొక్కలను పెంచడం వల్ల దోమలు దరిచేరవు.
వ్యక్తిగత రక్షణ..
చేతులు ,కాళ్లు కప్పేలా దుస్తులు ధరించాలి.
దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దోమల నివారణ లోషన్లు ఉపయోగించాలి.పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొడవాటి దుస్తులు వేయాలి, దోమతెరలు వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
