అపోహలు: ఇన్‌హేలర్లు వినియోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీలో ఆస్తమా రోగులు తమ చికిత్సలో కీలకమైన ఇన్‌హేలర్ల వినియోగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అధిక ఖర్చు, ఇన్‌హేలర్లపై అపోహలు, అవగాహన లేమి వల్ల ఆస్తమా చికిత్సలో అంతరాయం ఏర్పడుతోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి.. 

ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?

ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?

 

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ, ఇన్‌హేలర్లను సరిగ్గా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆస్తమా నియంత్రణలో ఇన్‌హేలర్లు అత్యంత ప్రభావవంతమైనవి అయినప్పటికీ, వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఒక నాణ్యమైన ఇన్‌హేలర్ ధర నెలకు 500 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది, ఇది తక్కువ ఆదాయ వర్గాలకు భారంగా మారుతోంది.

 అవగాహన లేమి..  

ఇన్‌హేలర్ల గురించిన అపోహలు ఆస్తమా చికిత్సకు అడ్డంకిగా మారుతున్నాయి. "ఇన్‌హేలర్లు అలవాటు అవుతాయి", "వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది" అని లేనిపోని అపోహలను నమ్ముతున్నారు. దీనికారణంగా చాలా మందిని ఇన్‌హేలర్లను ఉపయోగించడంలేదు. వైద్య నిపుణులు ఈ అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా చాలా చేయాల్సి ఉందని అంటున్నారు. ఇన్‌హేలర్ల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం సబ్సిడీలు అందించాలని వైద్య నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.  

 

ఇది కూడా చదవండి..న్యూట్రిషనిస్ట్ - డైటీషియన్ మధ్య తేడా ఏమిటో తెలుసా..?

ఇది కూడా చదవండి..వేసవికాలంలో నీరసంగా లేకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం అవసరం..? 

ఇది కూడా చదవండి..మలేరియా రహిత దేశంగా ప్రత్యేక చర్యలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.