సాక్షి లైఫ్ : గతంలో పేదరికం, పోషకాహార లోపం వంటి సమస్యలతో పోరాడిన భారతదేశంలో ఇప్పుడు కొత్త సవాల్ మొదలైంది. దేశంలో ఊబకాయం (Obesity) అనే మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని యూనిసెఫ్ (UNICEF) తాజాగా హెచ్చరించింది. 'చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి.