Simple Healthy Habits : అరవై దాటినా.. పడుచువారిలా ఉత్సాహంగా ఉండాలంటే..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు రావడం సహజం. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులతో, మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వయసు మీద పడటం వల్ల జీర్ణక్రియ నెమ్మదించడం, శారీరక శక్తి తగ్గడం జరుగుతుంది. అయితే, ఆయుర్వేదం సూచించే కొన్ని జీవనశైలి మార్పులు పాటిస్తే వృద్ధాప్యంలో కూడా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండొచ్చు. అవేంటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

1. తేలికపాటి, తాజా ఆహారమే మేలు..

వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం మందగిస్తుంది. కాబట్టి త్వరగా జీర్ణమయ్యే, పోషకాలు నిండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.

2. రోజూ వ్యాయామం తప్పనిసరి..

వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు, కండరాల బిగుతు తగ్గాలంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు నడక, చిన్నపాటి యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగై శక్తి అందుతుంది.

3. కంటి నిండా నిద్ర..

శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పూట మితంగా భోజనం చేయాలి. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూడటం, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.

4. ఆయుర్వేద మూలికలతో అద్భుత ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆయుర్వేద మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉసిరి, అశ్వగంధ, బ్రాహ్మి, పసుపు వంటివి వృద్ధాప్య సమస్యలను అడ్డుకుంటాయి. అయితే ఈ మూలికలు లేదా సప్లిమెంట్లను వాడే ముందు కచ్చితంగా ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం.

5. నూనెతో మర్దన (Oil massage)..

ఆయుర్వేదంలో తైల మర్దనకు (Oil Massage) ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రమం తప్పకుండా శరీరానికి ఆలివ్ లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి నిగారింపు రావడమే కాకుండా, నరాలకు, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.

6. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ..

కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం, ఇష్టమైన పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ధ్యానం (Meditation) చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

7. తరచుగా వైద్య పరీక్షలు (medical check-ups)..

60 ఏళ్లు దాటిన తర్వాత కాలానుగుణంగా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం అత్యవసరం. రక్తపోటు (bp), మధుమేహం (diabetes), గుండె, కళ్లు, ఎముకలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి....చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.