Green Potatoes : బంగాళాదుంపలు పచ్చగా ఉంటే తినకూడదా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన వంటగదుల్లో బంగాళాదుంపలకు ఉండే ప్రాధాన్యమే వేరు. కూరలు, వేపుళ్లు, పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్.. ఇలా దేనిలోకైనా ఇవి ఇట్టే సరిపోతాయి. అందుకే చాలామంది వీటిని కిలోల కొద్దీ ఒకేసారి కొని నిల్వ చేసుకుంటుంటారు. అయితే, కొన్ని రోజుల తర్వాత వాటిపై ఆకుపచ్చని మచ్చలు రావడం, లేదా దుంపంతా పచ్చగా మారడం మనం తరచూ చూస్తుంటాం. అలాంటి వాటిని వండుకుని తినొచ్చా..? పడేయాలా..? అన్న సందేహం చాలామందికి వస్తుంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Protect Your Liver Naturally : కాలేయం పదిలంగా ఉండాలంటే రోజూ ఈ ఐదు ఆహారాలు తీసుకోవాల్సిందే..!

 

ఇది కూడా చదవండి.. High Triglycerides : ట్రైగ్లిజరైడ్స్  ఈ సమస్య ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

పచ్చగా ఉండడానికి కారణమేంటి..?

బంగాళాదుంపలను ఎక్కువ వెలుతురులో లేదా నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచినప్పుడు వాటిలో 'క్లోరోఫిల్' ఉత్పత్తి కావడం మొదలవుతుంది. అందుకే అవి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. ఇలా రంగు మారే క్రమంలో దుంపల్లో సహజంగా ఉండే 'సోలనిన్' (Solanine) అనే విషపూరిత రసాయన సమ్మేళనం స్థాయిలు కూడా అమాంతం పెరుగుతాయి. ఈ రసాయనం మోతాదు మించితే మన శరీరానికి తీవ్ర హాని చేస్తుంది.

పచ్చగా ఉన్న దుంపలు తినొచ్చా..?

బంగాళాదుంపల మీద కేవలం ఒక చిన్న భాగం మాత్రమే పచ్చగా ఉంటే, ఆ మచ్చ ఉన్న భాగాన్ని కాస్త లోతుగా కత్తిరించి తీసేయాలి. ఆ తర్వాత పై తొక్కను మందంగా తీసేసి మిగతా దుంపను వాడుకోవచ్చు.

పూర్తిగా పచ్చబడితే.. ఏమిచేయాలి..?

అలా కాకుండా దుంపలో సగానికంటే ఎక్కువ భాగం ఆకుపచ్చ రంగులోకి మారినా, ఎక్కువ మొలకలు వచ్చినా, రుచిలో చేదు అనిపించినా వాటిని అస్సలు వాడకూడదు. వాటిని వెంటనే చెత్తబుట్టలో వేయడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.

పొరపాటున తింటే ఏమవుతుంది..?

సోలనిన్ మోతాదు ఎక్కువగా ఉన్న పచ్చటి బంగాళాదుంపలను తింటే ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కడుపులో మంట (acidity), వికారం, వాంతులు, తలతిరగడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సాధారణంగా ఈ సోలనిన్ పెరిగిన దుంపలు చేదుగా ఉంటాయి. కాబట్టి వండిన తర్వాత ఏమాత్రం చేదుగా అనిపించినా ఆ వంటకాన్ని తినకపోవడమే మంచిది.

పాడవకుండా ఎలా నిల్వ చేయాలి..?

బంగాళాదుంపలు పచ్చబడకుండా ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే నిల్వ చేసే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
బంగాళాదుంపలను ఎల్లప్పుడూ చీకటిగా, కాస్త చల్లగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి.

వెలుతురులో ఉంచకూడదు..

నేరుగా ఎండ తగిలే చోట లేదా ప్రకాశవంతమైన వెలుతురు పడే ప్రదేశాల్లో అస్సలు ఉంచకూడదు. కాంతి తగిలితే ఇవి త్వరగా పచ్చగా మారిపోతాయి. తేమ లేని పొడిగా ఉండే వాతావరణంలో గాలి ఆడేలా భద్రపరచడం వల్ల ఇవి సురక్షితంగా ఉంటాయి.

 

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.