Insulin Resistance : ఇన్సులిన్ నిరోధకత తగ్గినప్పుడు..? మీ బాడీలో కనిపించే లక్షణాలు ఇవే..!

షేర్ చేయండి:
Insulin Resistance : ఇన్సులిన్ నిరోధకత తగ్గినప్పుడు..? మీ బాడీలో కనిపించే లక్షణాలు ఇవే..!

సాక్షి లైఫ్ : మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో ఇన్సులిన్ పనితీరు మెరుగ్గా ఉండటం చాలా కీలకం. చాలామందికి తమలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుందో లేదో తెలియక అయోమయానికి గురవుతుంటారు. కేవలం రక్త పరీక్షలే కాకుండా, మన శరీరంలో కనిపించే కొన్ని మార్పుల ద్వారా కూడా ఇలాంటి మార్పును గుర్తించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడగానే కనిపించే మొదటి మార్పు శక్తి స్థాయిలు పెరగడం. గతంలోలా భోజనం చేసిన తర్వాత నీరసంగా అనిపించడం, పగటిపూట నిద్ర రావడం వంటివి తగ్గుతాయి. ముఖ్యంగా స్వీట్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాల మీద మనసు వెళ్లకుండా, ఆకలి అదుపులోకి వస్తుంది. ఇది మీ మెటబాలిజం గాడిలో పడుతోందని చెప్పడానికి ఒక సంకేతం.

చర్మం తేటగా కనిపించడం.. 

ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మెడ వెనుక, చంకల భాగంలో వచ్చే నల్లటి మచ్చలు (Acanthosis Nigricans) క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇన్సులిన్ స్థాయిలు సాధారణ స్థితికి రాగానే చర్మం మృదువుగా మారుతుంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వచ్చే మొటిమలు తగ్గి, చర్మం తేటగా కనిపిస్తుంది.

బరువు కంటే.. నడుం చుట్టుకొలత ప్రధానం..!

మీరు బరువు తగ్గకపోయినా, పాత దుస్తులు మీకు వదులు అవుతున్నాయా..? అయితే అది మంచి పరిణామమే..! శరీరంలో ఇన్సులిన్ పనితీరు బాగుంటే, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు (Visceral Fat) కరగడం మొదలవుతుంది. బరువు కంటే నడుం చుట్టుకొలత తగ్గడం అనేది మెటబాలిక్ ఆరోగ్యం మెరుగు పడుతోందని చెప్పడానికి బలమైన నిదర్శనం.

మహిళల్లో మార్పులు..

మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపడితే, వారి నెలసరి క్రమబద్ధం అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భధారణ అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

ఎంత కాలం పడుతుంది..?

జీవనశైలిలో మార్పులు చేసుకున్న రెండు నుంచి మూడు వారాల్లోనే శక్తి పెరగడం, ఆకలి తగ్గడం వంటివి గమనించవచ్చు. అయితే చర్మంపై మార్పులు, బరువు తగ్గడం వంటివి స్పష్టంగా తెలియడానికి 6 నుంచి 12 వారాల సమయం పడుతుంది. బరువు తగ్గడం మాత్రమే లక్ష్యం కాకుండా, రోజూ వ్యాయామం చేయడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని శాశ్వతంగా మెరుగుపరచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.