Summer Health Care: ఎండ నుంచి రాగానే ఈ పనులు చేస్తున్నారా..? ఐతే మీరు ప్రమాదంలో పడ్డట్టే..!

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా సూర్యుడు సుర్రుమంటున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటేస్తున్నాయి. చరిత్రలోనే 2026 మార్చి అత్యంత వేడి నెలగా నమోదవ్వడం రాబోయే మే, జూన్ నెలల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో, బయటకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే.. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతకమైన  'హీట్ స్ట్రోక్'కు దారితీస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?

 

వెంటనే చల్లని నీళ్లు తాగుతున్నారా..?

ఎండలో నుంచి రాగానే గొంతు ఎండిపోయి, ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం చాలామందికి అలవాటు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. బయట ఎండ వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో ఒక్కసారిగా ఐస్ వాటర్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది గుండె వేగంపై ప్రభావం చూపడమే కాకుండా, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది.

ఏసీ గదిలోకి వెళ్లకండి..!

బయట ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రాగానే ఏసీ ఆన్ చేసి దాని ముందు కూర్చోవడం మరో తప్పు. తీవ్రమైన వేడి నుంచి ఒక్కసారిగా అత్యంత శీతల వాతావరణంలోకి వెళ్లడం వల్ల 'థర్మల్ షాక్' తగిలే ప్రమాదం ఉంది. దీనివల్ల కండరాల నొప్పులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఫ్యాన్ గాలికి కాసేపు కూర్చుని, చెమట ఆరిన తర్వాతే ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టుకోవాలి.

 జాగ్రత్తలు..  

ఎండ వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. దీని నివారణకు కేవలం నీరు మాత్రమే కాకుండా..ఓఆర్ఎస్ (ORS).. శరీరానికి అవసరమైన లవణాలను అందిస్తుంది. కొబ్బరి నీళ్లు.. సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లు శరీరానికి శక్తినిస్తాయి. మజ్జిగ..శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తుంది.

వైద్యనిపుణులు సూచిస్తున్న ఆరోగ్య సూత్రాలు.. 

ఎండలో నుంచి రాగానే కనీసం 15 నుంచి 20 నిమిషాలు చల్లని, పొడి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. చెమట ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం, చేతులు, కాళ్లు కడుక్కోవడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.  వేసవిలో పెరుగు, పండ్లు, సలాడ్లు వంటి తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నూనె వస్తువులు, మసాలాలకు దూరంగా ఉండాలి. చెమటను పీల్చుకునే కాటన్ బట్టలను ధరించడం వల్ల చర్మ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ రావాల్సి వస్తే గొడుగు లేదా తలకు స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. 

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : summer-health-tips summer-season summer-health summer-tips summer-alert sunstroke
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com