సాక్షి లైఫ్ : కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం రెండు చాలా ముఖ్యమైన అంశాలు. ఈ రెండు పనులు చేయడం ద్వారా, మీరు మీ మూత్రపిండాలను మాత్రమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ డే గా జరుపుతారు. ఈ సంవత్సరం మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఇది కూడా చదవండి.. మంచూరియా, పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది..?
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?
సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలి కూడా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. దానిలోని ఏ రకమైన లోపం తలెత్తినా ఒక్కోసారి తీవ్రమైన వ్యాధులకు, ప్రాణాపాయానికి కూడా కారణమవుతుంది. కిడ్నీ శరీరంలో రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మొదటిదివీధిలో భాగంగా శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. రెండవ విధిలో భాగంగా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం సమతుల్యతను నిర్వహిస్తుంది. కిడ్నీలు ఉదరం లోపల, వెనుక భాగంలో, వెన్నెముకకు ఇరువైపులా పక్కటెముకల మధ్య ఉంటుంది. మూత్రపిండాలకు ఎలాంటి ఆహారం ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్..
ఆపిల్ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. దీనికి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆకు కూరలు..
బచ్చలికూర, ఆకుకూరలు, మెంతుకూర వంటి ఆకు కూరలు కిడ్నీకి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి ఉంటాయి. ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కిడ్నీ బీన్స్..
రాజ్మా అని కూడా అంటారు. కిడ్నీ ఆకారంలో ఊడడం వల్ల వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు.ఇందులో మినరల్స్ , ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కిడ్నీ బీన్స్ వంటి పప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు అవసరమైన పొటాషియం అందుతుంది.
పుట్టగొడుగులు..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టగొడుగులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ డి వంటి మినరల్స్ కిడ్నీ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.
ఖర్జూరం..
కిడ్నీ ఆరోగ్యానికి ఖర్జూరం చాలా మేలు చేస్తుంది. వీటిలో పొటాషియం, ఫైబర్,ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ సూపర్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ వీటిని తీసుకునే ముందు మీరు ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.
ఇది కూడా చదవండి.. పాప్‌కార్న్ బ్రెయిన్ అంటే..? దీనివల్ల ఏమైనా ఇబ్బందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com