How to Prevent Fatty Liver : ఫ్యాటీ లివర్ నివారణకు సరైన సొల్యూషన్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత రోజుల్లో ఫ్యాటీ లివర్ (Fatty Liver) అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. కాలేయంలో మోతాదుకు మించి కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. అయితే, ప్రారంభ దశలో దీని లక్షణాలు అంతగా బయటపడవు. సాధారణ ఆరోగ్య పరీక్షలు లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే చాలామందికి ఈ విషయం తెలుస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగడం వంటివి ఈ ముప్పును పెంచుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే కాలక్రమేణా లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి బరువు, ఆహారపు అలవాట్లు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ఫ్యాటీ లివర్‌కు దారితీసే ప్రధాన కారణాలు ఇవే..

ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు..

 ఫ్యాటీ లివర్ బారిన పడటానికి అధిక బరువు ప్రధాన కారణం. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు (Belly fat) పేరుకుపోవడం వల్ల జీవక్రియల (Metabolism) పనితీరు దెబ్బతిని, కాలేయంలో కొవ్వు చేరే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి బరువును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకోవడం అత్యంత ఆవశ్యకం.

మధుమేహం, ఇన్సులిన్ రెసిస్టెన్స్..

 టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరం ఇన్సులిన్‌ను సరైన రీతిలో వినియోగించుకోలే నప్పుడు, అది నేరుగా జీవక్రియలపై ప్రభావం చూపి కాలేయంలో కొవ్వు నిల్వలకు దారితీస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం డయాబెటిస్‌కే కాదు, కాలేయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు..

 అధిక క్యాలరీలు, జంక్ ఫుడ్, సంతృప్త కొవ్వులు (Saturated fats), తీపి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై భారం పడుతుంది. ముఖ్యంగా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పానీయాలు ఫ్యాటీ లివర్ ముప్పును పెంచుతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

శారీరక శ్రమ లేకపోవడం..

రోజంతా కూర్చునే ఉండటం, ఏమాత్రం వ్యాయామం చేయకపోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. శారీరక శ్రమ లేకపోవడం నేరుగా కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజూవారీ దినచర్యలో నడక (walking), యోగా లేదా ఇతర వ్యాయామాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

అధికంగా మద్యం సేవించడం..

 మోతాదుకు మించి మద్యం తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. జీవక్రియల లోపం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ వేరైనప్పటికీ, మద్యం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటమే సరైన మార్గం.

ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రతరం కాకుండా ఉండాలంటే.. ఏవైనా లక్షణాలు కనిపించిన వెంటనే లేదా సాధారణ హెల్త్ చెకప్‌లో ఫ్యాటీ లివర్ అని తేలినా, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, సలహాలు తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.