దాల్చిన చెక్క నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజమైన మసాలా దినుసు. ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడమేకాకుండా, దాల్చిన చెక్క నీరు అనేక వ్యాధులను నిర్మూలించడంలో దాల్చిన చెక్క నీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. దాల్చిన చెక్క నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

 

ఇది కూడా చదవండి..డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ 5 చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?

 

-బరువు తగ్గించడంలో.. 

ప్రస్తుత కాలంలో స్థూలకాయం ఒక ప్రధాన సమస్యగా మారింది. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా జీవక్రియ వేగంగా జరిగి, అదనపు కొవ్వు కరుగుతుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని కొవ్వును కరిగించి, శక్తివంతమైన జీవక్రియకు దోహదపడతాయి.

-ఎలా తాగాలి..?

రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పెట్టుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని వేడి చేసి తాగాలి.

-డయాబెటిస్‌ ను అదుపులో ఉంచడంలో.. 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో దాల్చిన చెక్క నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి, గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది.

-ఎలా తాగాలి..?

ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు ఒకసారి తాగాలి.

-జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో.. 

దాల్చిన చెక్క నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి, పేగులను శుభ్రపరుస్తుంది.

-ఎలా తాగాలి..?

భోజనం తర్వాత ఒక కప్పు గోరువెచ్చని దాల్చిన చెక్క నీరు తాగడం ఉత్తమం.

-రోగనిరోధక శక్తిని పెంచడంలో..  

దాల్చిన చెక్కలో యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడతాయి.

-ఎలా తాగాలి?


ఒక కప్పు వేడి నీటిలో దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తాగాలి.

 

ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?

ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes type2diabetes weight-loss weight-lose immune-system diabetes-risk over-weight weight-loss-tips digestion metabolism seasonal-diseases how-to-beat-diabetes cinnamon-basil disease-control natural-medicine natural-antioxidants boost-immunity what-to-eat-to-boost-immunity reverse-prediabetes herbal-medicine metabolism-boost boost-metabolism herbal-remedies metabolism-booster cinnamon-water-benefits health-benefits-of-cinnamon-water cinnamon-water-health-benefits amazing-cinnamon-water-health-benefits amazing--health-benefits-of-cinnamon-water
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com