సమ్మర్ హెల్త్ : ఈ అనారోగ్య సమస్యలున్న వాళ్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..?  

షేర్ చేయండి:
సమ్మర్ హెల్త్ : ఈ అనారోగ్య సమస్యలున్న వాళ్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..?  

సాక్షి లైఫ్ : ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పలు అనారోగ్య సమస్యలున్నవాళ్ళు తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అధిక రక్తపోటు (హై బిపి) ఉన్నవారు ఈ ఎండాకాలంలో వారి గుండె ఆరోగ్యకరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి చల్లటి ప్రదేశంలో ఉంటూ వేసవి వేడికి దూరంగా మసలుకోవడం కూడా ఎంతో ముఖ్యం. 

ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు.. 

అవసరమైతే నీడ పట్టునే ఉంటూ చల్లదనం కోసం ఫ్యాన్‌లు లేదా ఎయిర్ కండిషనింగ్‌లను వాడుకోవాలి, ఇంకా, వేడి ఎక్కువగా ఉన్న సమయంలో కష్టముండే పనులకు చేయకూడదు. అంతే కాకుండా, సోడియం తక్కువగా ఉన్న పదార్థాలను తీసుకుంటూ బీపీని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉంటే రక్తపోటును పెరగకుండా చూసుకోవచ్చని ఓమ్ని హాస్పిటల్స్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.నాగవేందర్ రావు చెబుతున్నారు.

ఆస్తమా ఉన్నవాళ్లు.. 

ఎండాకాలంలో గాలిలో కాలుష్యం ఇంకా పూల పుప్పొడి ఎక్కువ ఉన్నట్లయితే, ఆస్తమా సమస్య ఉన్నవారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలలు రాకుండా ఇంకా ఆస్తమా పెరగకుండా చూసుకొనేందుకు, గాలిలో పుప్పొడి ఇంకా కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయాలలో ఇంటిపట్టునే ఉండడం మంచిది. 

ఇది కూడా చదవండి.. ఎలాంటివాళ్లకు లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుందంటే..?  

కిటికీలు మూసి ఉంచి ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం వల్ల కూడా అలర్జీలు ఇంకా కాలుష్యం కలిగించే వాటికి దూరంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేకాకుండా, వైద్యులు వాడమని చెప్పిన ఇన్హేలర్‌లు లేదా మందులను ఎల్లవేళలా వెంట ఉంచుకోవడం, ఆస్తమా ఎక్కువైనపుడు తీసుకోవలసిన తగిన జాగ్రత్తలను ముందే తెలుసుకొని ఉండడం అనేవి ఆస్తమా ఎక్కువై ఊపిరాడని సమయంలో వెంటనే చికిత్స చేసేందుకు ఉపకరిస్తాయి. 

క్యాన్సర్‌ బాధితులు..  

క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు ఈ ఎండాకాలంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. కీమోథెరపీ,రేడియేషన్ థెరపీ శరీరంలోని రోగనిరోధకతపై ప్రభావం కలిగించవచ్చు, తద్వారా అది వారికి వేడితో పుట్టుకొచ్చే మరికొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, శరీరానికి నీటి కొరత లేకుండా చూసుకోవడం, ఎండ నుంచి రక్షణనిచ్చే సన్‌స్క్రీన్ లోషన్‌తో పాటు తగిన బట్టలను వేసుకోవడం ఇంకా ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో నేరుగా ఎండలో వెళ్ళకుండా ఉండడం లాంటి జాగ్రతలు పాటించడం ఎంతో ముఖ్యం. 

అంతేకాకుండా, క్యాన్సర్ మందులపైన సూర్యరశ్మి నేరుగా సోకకుండా చూసుకోవాలి. అలా నేరుగా మందులపై ఎండ పడినప్పుడు ఎదురయ్యే పరిస్థితుల గురించి డాక్టర్ సలహా పాటించి సురక్షితంగా ఉండవచ్చు.

గుండె సమస్యలు ఉన్నవాళ్లు.. 

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా ఈ వేసవిలో తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వేడి ఎక్కువైతే గుండెలోని రక్తనాళ వ్యవస్థ దెబ్బతింటుంది. వేడితో కలిగే సమస్యలను తగ్గించుకొనేందుకు, చల్లటి ప్రదేశంలో ఉంటూ తరచుగా పానీయాలను తీసుకొంటు ఉండటం, శారీరకంగా ఎక్కువ కష్టం చేయకుండా, ఉక్కపోత కారణంగా అలసట లేదా వడదెబ్బ వంటివి కలగకుండా చూసుకోవడం ఎంతో అవసరం. అలాగే, డాక్టరుగారు ఇచ్చిన మందులు తప్పనిసరిగా వేసుకుంటూ పరిమిత ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల గుండె సమస్యలను పెరగకుండా ఉంచుకోవచ్చు.

 కిడ్నీ సమస్యలన్న వాళ్లు.. 

వేసవిలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారి శరీరంలో నీరు ఇంకా ఎలక్ట్రోలైట్‌లు సరైన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఇంకా మరెలాంటి సమస్యలు కలగకుండా నీరు ఇంకా ఎలక్ట్రోలైట్‌లు ఎక్కువగా ఉండే పానీయాలతో సహా తగినంత ద్రవాలను తీసుకోవడం కూడా చాలా అవసరం. అంతే కాకుండా, చక్కెర లేదా కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించి అలాగే మూత్ర విసర్జనను గమనించి దానిని బట్టి హైడ్రేషన్ ఏ స్థాయిలో ఉందో సులువుగా పసిగట్టవచ్చు.

ఇది కూడా చదవండి.. ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పురుషుల్లో ఎందుకు పెరుగుతున్నాయంటే..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.