సాక్షి లైఫ్ : కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కళ్లు పసుపు రంగులోకి మారతాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సంకేతాలను ఏమాత్రం విస్మరించకూడదు.హెపటైటిస్ (Hepatitis): వైరస్ (A, B, C) కారణంగా కాలేయంలో వచ్చే వాపు (Inflammation).సిర్రోసిస్ (Cirrhosis).. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు లేదా మద్యపానం (Alcoholism) వల్ల కాలేయ కణజాలం గట్టిపడి, దెబ్బతినడం.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఫ్యాటీ లివర్ (Fatty Liver): కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఇది ముదిరితే సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పిత్త వాహిక అడ్డంకులు (Bile Duct Obstruction).. పిత్తాశయ రాళ్లు లేదా కణితుల కారణంగా పిత్తాశయం నుంచి ద్రవం ప్రవాహం నిలిచిపోవడం.
ఎలా జాగ్రత్త పడాలి మరి..?
కళ్లు పసుపు రంగులోకి మారినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణంతో పాటు మరికొన్ని సంకేతాలు ఉంటే చికిత్స తప్పనిసరిగా అవసరం. తీవ్రమైన కడుపు నొప్పి లేదా వాపు. ముదురు రంగు మూత్రం, మలం పాలిపోవడం. తీవ్రమైన అలసట, బలహీనత. వికారం లేదా వాంతులు. కళ్లు పసుపురంగులోకి మారడం అంటే అది కాలేయం అత్యవసరంగా సహాయం కోరుతోందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు తప్పనిసరిగా ఆయా సంకేతాలను పరిగణలోకి తీసుకోవాలి.