సాక్షి లైఫ్ : సాధారణంగా నిర్లక్ష్యం చేసే అనారోగ్య సమస్యల్లో నోరు పొడిబారడం (Dry Mouth) ఒకటి. దీనిని వైద్య పరిభాషలో జిరోస్టోమియా (Xerostomia) అంటారు. అయితే, ఇది కేవలం డీహైడ్రేషన్ లక్షణం మాత్రమే కాదు, మీ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి, మొత్తంగా శరీర ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని దంత వైద్య నిపుణులు (Dentists) హెచ్చరిస్తున్నారు. సరిగ్గా గుర్తించి, చికిత్స తీసుకోకపోతే ఇది దంత సమస్యలను పెంచుతుందని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.."ఓఆర్ ఎస్" పేరుతో స్వీట్ డ్రింక్స్ అమ్మడం నేరం: ఆరోగ్య శాఖ హెచ్చరిక..
ఇది కూడా చదవండి..Zinc Deficiency : వాసన రావడం లేదా..? అయితే అది 'జింక్' లోపానికి సంకేతం..!
ఇది కూడా చదవండి..Back pain : సయాటికాకు, సాధారణ నడుము నొప్పికి తేడా ఏమిటి..?
ఇది కూడా చదవండి..Jaundice: కళ్లు పసుపు రంగులో ఉంటే కామెర్లు ఉన్నట్లేనా..?
‘పొడి నోరు’ (Dry Mouth) అంటే ఏమిటి..?
నోటిని ఎప్పుడూ తేమగా ఉంచేందుకు అవసరమైన లాలాజలం (Saliva) గ్రంథుల నుంచి తగినంతగా ఉత్పత్తి కానప్పుడు నోరు పొడిబారినట్లు అనిపిస్తుంది. లాలాజలం లేకపోవడం వల్ల నోటిలోని సహజమైన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది.
పొడి నోరు ఎందుకు ప్రమాదకరం అంటే..?
లాలాజలం అనేక ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది.. ఆహారం, చక్కెర అవశేషాలను శుభ్రం చేసి, దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది.
యాంటీబయాటిక్‌గానూ పనిచేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా, ఫలకాలు (Plaque) పెరగకుండా నియంత్రిస్తుంది. జీర్ణక్రియ విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం కావడంలో సహాయపడుతుంది.
లాలాజలం తగ్గితే దంతక్షయం (Cavities), చిగుళ్ల వ్యాధి (Gum Disease), నోటి పూతల (Mouth Sores) వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
లక్షణాలు (Symptoms) ఎలా ఉంటాయి..?
నిరంతరం నోరు పొడిబారినట్లయితే కొన్నిరకాల లక్షణాలు కనిపిస్తాయి..
నోటిలో జిగటగా, అంటుకునే భావన లేదా ఎప్పుడూ పొడిగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
చెడు శ్వాస (Bad Breath)..
మింగడం, మాట్లాడటం లేదా ఆహారం నమలడం కష్టంగా అనిపించడం.
నాలుక ఎండిపోయి, గరుకుగా లేదా మంటగా అనిపించడం. పెదవులు, నోటి మూలలు పగుళ్లు లేదా పుండ్లు పడటం. గొంతు నొప్పి లేదా గొంతు బొంగురుపోవడం. రుచిలో మార్పు రావడం (Altered taste).
నోరు పొడి బారడానికి ప్రధాన కారణాలు (Causes)..
నోరుపొడి బారడానికి వ్యక్తిగత అలవాట్లతో పాటు అంతర్లీన ఆరోగ్య సమస్యల వరకు అనేక కారణాలు ఉండవచ్చు. అంతేకాదు ఒక్కోసారి మందుల దుష్ప్రభావాల కారణంగా కూడా నోరు పొడిబారే అవకాశం ఉంటుంది. యాంటిడిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్లు, అధిక రక్తపోటు మందులు, డీకాంగెస్టెంట్లు వంటి వందల రకాల మందుల వల్ల నోరు పొడిబారే సమస్య వస్తుంది.
మధుమేహం (Diabetes), స్జోగ్రెన్స్ సిండ్రోమ్ (Sjögren's Syndrome), అల్జీమర్స్, స్ట్రోక్ లేదా HIV వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు.
చికిత్సలు: తల, మెడ ప్రాంతాలకు సంబంధించిన క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకునే రేడియేషన్ లేదా కీమోథెరపీ.
అలవాట్లు: ధూమపానం (Smoking), పొగాకు నమలడం లేదా నోరు తెరిచి నిద్రపోవడం.
డీహైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గడం.
చికిత్స, నివారణ మార్గాలు (Treatment)..
పొడి నోరు చికిత్స దాని వెనుక ఉన్న మూల కారణాన్ని బట్టి ఉంటుంది. వైద్య నిపుణులు సూచించే ప్రధాన మార్గాలు:
కారణాన్ని పరిష్కరించడం: నోరు పొడిబారడానికి కారణమైన మందుల మోతాదును డాక్టర్‌ను సంప్రదించి మార్చుకోవడం లేదా మధుమేహం వంటి అంతర్లీన వ్యాధులను నియంత్రించడం.
లాలాజల ఉత్పత్తిని పెంచడం..
చక్కెర లేని చూయింగ్ గమ్‌లు లేదా లాజెంజ్‌లను నమలడం. ఇది సహజంగా లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది.
కృత్రిమ లాలాజలం: నోటిలో తేమను పెంచడానికి కృత్రిమ లాలాజల స్ప్రేలు లేదా మాయిశ్చరైజింగ్ జెల్‌లను వాడటం.
జీవనశైలి మార్పులు తప్పనిసరి..
నీరు ఎక్కువగా తాగడం అంటే ఒకేసారి మరిన్ని నీళ్లు తాగకుండా, తరచూ కొద్ది కొద్దిగా నీటిని తాగుతూ ఉండాలి. ధూమపానం, మద్యం, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలను తగ్గించడం. పరిశుభ్రత దంతక్షయాన్ని నివారించడానికి రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా దంత పరీక్షలకు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..@ 7 ఏళ్లు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'..
ఇది కూడా చదవండి..Sciatica : సయాటికా, నడుము నొప్పి ఉపశమనం కోసం ఉత్తమ యోగాసనాలు..
ఇది కూడా చదవండి..Hypertension : చెవుల్లో 'రింగుమనే' శబ్దం హైపర్‌టెన్షన్‌కు హెచ్చరిక సంకేతమా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com