స్థూలకాయం సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచే పండు..

షేర్ చేయండి:
స్థూలకాయం సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచే పండు..

సాక్షి లైఫ్ : స్ట్రాబెర్రీ అనేది పిల్లలు, పెద్దలు ఇష్టపడే పండు. బయట ఎంత అందంగా ఉంటుందో, లోపల కూడా అంతే రుచికరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎరుపు రంగులో ఉండే ఈ ఆరోగ్యకరమైన పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్ "సి" మన శరీరానికి చాలా అవసరం. స్ట్రాబెర్రీలో విటమిన్ "సి" పుష్కలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు

ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?

ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?

స్ట్రాబెర్రీ..

స్ట్రాబెర్రీలలోని ఆంథోసైనిడిన్‌లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నివారణతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.స్ట్రాబెర్రీలను తినడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ తగ్గి, తద్వారా ఇన్సులిన్ వాడకాన్ని నియంత్రిస్తుంది. స్ట్రాబెర్రీలలో పాలీఫెనాల్స్ అనే రక్షిత మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. వాటిలో ఎల్లాజిక్ యాసిడ్, ఎల్లాజిటానిన్లు రక్తంలో చక్కెరను నియంత్రించ డమేకాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
 

ఊబకాయం సంబంధిత వ్యాధులను తగ్గించడానికి..


స్ట్రాబెర్రీలు కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్ట్రాబెర్రీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణాలు ఇందులో ఉన్నాయి. 
స్ట్రాబెర్రీలు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా కలిగి ఉంటాయి. దీనికారణంగా  రక్తంలో చక్కెర స్థాయిని మితంగా విడుదల చేయడానికి ఇది సహాయపడుతుంది. బరువు నియంత్రణకు, ఊబకాయం సంబంధిత వ్యాధులను తగ్గించడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలని, ఇవి అధికంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.