హెపటైటిస్ ఏ గురించి తెలుసుకోవాల్సిన 3 ప్రధాన వాస్తవాలు.. 

షేర్ చేయండి:
హెపటైటిస్ ఏ గురించి తెలుసుకోవాల్సిన 3 ప్రధాన వాస్తవాలు.. 

సాక్షి లైఫ్ : హెపటైటిస్ ఏ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. హెపటైటిస్ ఏ అనేది కాలేయంలో వాపును కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వాపు వల్ల కాలేయం పనితీరు దెబ్బతిని, రక్తంలో బిలిరుబిన్ అనే సమ్మేళనం పెరుగుతుంది. బిలిరుబిన్ స్థాయిలు పెరిగినప్పుడు చర్మం, గోర్లు, కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. దీన్నే మనం కామెర్లు అంటాం. కామెర్లతో పాటు, జ్వరం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు వంటి ఇతర లక్షణాలు కూడా కాలేయ వాపు కారణంగా కనిపిస్తాయి. 

 

ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..  

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

హెపటైటిస్ ఏ నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల నుంచి రెండు నెలల సమయం పట్టవచ్చు. కామెర్లు హెపటైటిస్ ఏ కే కాకుండా, కాలేయానికి సంబంధించిన ఏదైనా ఇతర వ్యాధికి కూడా ఒక లక్షణం కాగలదని గుర్తుంచుకోవాలి.

వయస్సుతో పాటు హెపటైటిస్ ఏ ప్రమాదం, తీవ్రత పెరుగుతుంది. పరిశుభ్రత పెరగడం వల్ల పిల్లలలో హెపటైటిస్ ఏ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, చాలా మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడకుండానే కౌమారదశకు చేరుకుంటున్నారు, అంటే వారికి ఈ వైరస్‌ నిర్మూలించగలిగే రోగనిరోధక శక్తి ఉంటుందని అర్థం. పెద్దలలో హెపటైటిస్ ఏ కేసులు పెరుగుతున్నాయి. వీరిలో ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు చాలా తీవ్రమైన సందర్భాల్లో కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. 

కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. భారతదేశంలో ఐదేళ్ల లోపు పట్టణ పిల్లలలో హెపటైటిస్ ఏ, సెరోప్రెవలెన్స్ (వైరస్‌కు గురైన వారి సంఖ్య) తగ్గుతోందని గణాంకాలు చూపుతున్నాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో దాదాపు 70 శాతం మంది పెద్దలు హెపటైటిస్ ఎకు సెరోపోజిటివిటీని కలిగి ఉన్నారు. రోగనిరోధక శక్తి లేని వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ సంఖ్య సూచిస్తుంది.

ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..

ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.