Mosquitoes : దోమల బెడద వేధిస్తోందా..? ఇంట్లోకి రాకుండా అడ్డుకునే సులువైన మార్గాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాయంత్రం కాగానే ఇంట్లోకి ప్రవేశించే దోమలు కంటిమీద కునుకు లేకుండా చేయడమే కాకుండా... డెంగీ, మలేరియా, చికెన్‌ గున్యా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కేవలం దోమలను చంపే మందులపైనే ఆధారపడకుండా, అవి వృద్ధి చెందకుండా ఇంట్లో, పరిసరాల్లో కొన్ని సహజ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

నీటి నిల్వలకు తావివ్వద్దు..

నిలిచి ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెట్టి వేగంగా వృద్ధి చెందుతాయి. కూలర్లు, పూలకుండీల ట్రేలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, బకెట్లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పారబోసి శుభ్రం చేయాలి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

కిటికీలకు జాలీలు (mesh)..

 దోమలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడమే అన్నింటికంటే ఉత్తమ మార్గం. కిటికీలు, వెంటిలేటర్లకు సన్నని మెష్‌లు అమర్చుకోవాలి. సాయంత్రం వేళల్లో తలుపులు ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. మెష్‌లకు రంధ్రాలు పడితే వెంటనే సరిచేసుకోవాలి.

దోమతెరలే సురక్షితం..

ఎటువంటి రసాయనాల ప్రభావం లేకుండా దోమల కాటు నుంచి తప్పించుకోవడానికి దోమతెరల వాడకం అత్యంత సురక్షితమైన మార్గం. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో దోమతెరలు వాడటం ఎంతో శ్రేయస్కరం.

ఫ్యాన్ గాలి ప్రభావం..

దోమల బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల వేగంగా వీచే గాలిని తట్టుకుని ఎగరలేవు. నిద్రించే సమయంలో సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ వేగం కాస్త పెంచడం వల్ల దోమలు దరిచేరకుండా కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.

పరిసరాల పరిశుభ్రత..

మంచాల కింద, సోఫాల వెనుక, కర్టెన్ల చాటున, స్టోర్‌ రూముల్లో ఉండే చీకటి ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా దాక్కుంటాయి. ఇంటి మూలలతో పాటు ఇంటి చుట్టుపక్కల ఉండే చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

రిపెల్లెంట్లతో జాగ్రత్త..

లిక్విడ్ వేపరైజర్లు, కాయిల్స్ లేదా స్ప్రేలు వాడేటప్పుడు గదిలో తగినంత గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు పొగ వచ్చే కాయిల్స్‌కు దూరంగా ఉండటం మంచిది.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.