Types of Schizophrenia : స్కిజోఫ్రీనియాలో రకాలు.. ఏ లక్షణం దేనికి సంకేతం అంటే..?

సాక్షి లైఫ్ : కొన్ని కారణాల వల్ల కొందరికి మనసుపై పట్టు తప్పి, వాస్తవానికి లోకానికి దూరంగా బ్రతికేలా చేసే తీవ్రమైన మానసిక స్థితి 'స్కిజోఫ్రీనియా' (Schizophrenia). గతంలో దీనిని కేవలం ఒకే రకమైన వ్యాధిగా భావించేవారు. కానీ వైద్య విజ్ఞానం పెరిగిన కొద్దీ, ఇందులో వివిధ రకాలు ఉన్నాయని, ఒక్కో రకంలో లక్షణాలు ఒక్కోలా ఉంటాయని నిపుణులు గుర్తించారు. ఇటీవలి కాలంలో వైద్యులు కేవలం రకాల కంటే, బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాల తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

స్కిజోఫ్రీనియాలోని ప్రధాన రకాలు..? 

  స్కిజోఫ్రీనియాలో ఐదు రకాలున్నాయి. 

1. పారనాయిడ్ స్కిజోఫ్రీనియా (Paranoid Schizophrenia)
ఇది అత్యంత సాధారణమైన రకం. ఇందులో బాధితులకు వింతైన అనుమానాలు ఉంటాయి.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఎవరో తమను వెంబడిస్తున్నారని, తమపై కుట్ర చేస్తున్నారని లేదా తమను చంపాలని చూస్తున్నారని బలంగా నమ్ముతారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరో మాట్లాడుతున్నట్లు (Auditory Hallucinations) వీరికి వినిపిస్తుంది.

2. డిస్ఆర్గనైజ్డ్ స్కిజోఫ్రీనియా (Disorganized Schizophrenia)దీనిని 'హెబెఫ్రెనిక్' అని కూడా అంటారు. ఇందులో ఆలోచనలు, మాటలు అస్తవ్యస్తంగా ఉంటాయి.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

సందర్భోచితంగా కాకుండా వింతగా నవ్వడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడటం, చిన్న పిల్లల్లా ప్రవర్తించడం వంటివి చేస్తారు. వీరు తమ పనులు అంటే స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం కూడా సొంతంగా చేసుకోలేరు.

3. కాటటోనిక్ స్కిజోఫ్రీనియా (Catatonic Schizophrenia) ఇది కదలికలకు సంబంధించిన సమస్య. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

బాధితులు గంటల తరబడి ఒకే భంగిమలో కదలకుండా ఉండిపోతారు (Stupor). లేదా విపరీతమైన ఉద్వేగంతో అటు ఇటు పరిగెత్తడం, ఎదుటివారు చెప్పిన మాటలనే మళ్ళీ మళ్ళీ అనడం వంటివి చేస్తారు.

4. అన్ డిఫరెన్షియేటెడ్ స్కిజోఫ్రీనియా..ఒకే వ్యక్తిలో అన్ని రకాల లక్షణాలు మిశ్రమంగా ఉన్నప్పుడు ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు.లక్షణాలు ఎలా ఉంటాయి..?వీరికి భ్రమలు ఉండవచ్చు, మాటల్లో స్పష్టత లేకపోవడంతోపాటు, ప్రవర్తన వింతగా ఉంటుంది.  

5. రెసిడ్యువల్ స్కిజోఫ్రీనియా (Residual Schizophrenia)
గతంలో తీవ్రమైన లక్షణాలు ఉండి, చికిత్స తర్వాత అవి తగ్గుముఖం పట్టిన స్థితి ఇది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

వీరికి భ్రాంతులు లేదా భ్రమలు పెద్దగా ఉండవు కానీ.. ఎప్పుడూ నీరసంగా ఉండటం, దేనిపై ఆసక్తి లేకపోవడం, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం వంటి 'నెగటివ్ లక్షణాలు' కనిపిస్తాయి.

ఇతర సమస్యలు.. 

స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్ ఇందులో స్కిజోఫ్రీనియా లక్షణాలతో పాటు విపరీతమైన నిరాశ (Depression) లేదా అతి ఉత్సాహం (Mania) వంటి మూడ్ సమస్యలు కూడా ఉంటాయి.

ఎలాంటప్పుడు జాగ్రత్త పడాలి అంటే..?

కౌమార దశ (15-25 ఏళ్ల మధ్య) లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఎక్కువ.

ఎవరితోనూ కలవకపోవడం.

వింతగా మాట్లాడటం.

పరిశుభ్రత పాటించకపోవడం.

లేని శబ్దాలు వినబడటం.

స్కిజోఫ్రీనియా అంటే నయం కాని జబ్బు కాదు. సరైన సమయంలో సైకియాట్రిస్ట్ సలహాతో మందులు వాడితే, బాధితులు సాధారణ జీవితాన్ని గడపవచ్చు. దీనిని 'దయ్యం పట్టింది' అని భావించి కాలయాపన చేయడం వల్ల పరిస్థితి విషమిస్తుందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression mental-tensions mental-issues schizophrenia symptoms-of-schizophrenia schizophrenia-symptoms schizophrenia-treatment schizophrenia-best-treatment
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com