Variant Polio Virus: వ్యాక్సిన్ తోనే 'వేరియంట్ పోలియో వైరస్'కు చెక్..!
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా పోలియో రహిత సమాజం కోసం జరుగుతున్న పోరాటంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న 'వేరియంట్ పోలియో వైరస్' (variant poliovirus) పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అడ్డుకోవాలంటే చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచేలా మెరుగైన టీకా పంపిణీ (Improved Immunisation) ఒక్కటే మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
వేరియంట్లు ఎందుకు పుడుతున్నాయి అంటే..?
సాధారణంగా పోలియో చుక్కల మందు (OPV) సురక్షితమైనదే. అయితే, పారిశుధ్య లోపం ఉన్న ప్రాంతాల్లో లేదా టీకా కార్యక్రమాలు అరకొరగా సాగే చోట్ల ఈ వైరస్ ఇతరులకు సోకి, కాలక్రమేణా తన రూపాన్ని మార్చుకుంటుంది. దీనినే 'వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్' (VDPV) అంటారు.
టీకాలు వేయించడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల్లో రోగనిరోధకత తగ్గి, వైరస్ వ్యాప్తికి అవకాశం లభిస్తుంది. తక్కువ ఇమ్యూనిటీ ఉన్న సమూహాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి మారుతున్న కొద్దీ బలపడి, పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉంది.
పోలియో చుక్కల మందు (OPV)తో పాటు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే టీకా (IPV)ను కలిపి ఇవ్వడం వల్ల చిన్నారుల్లో తిరుగులేని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేరియంట్లను అడ్డుకోవడానికి సరికొత్త 'నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్' (nOPV2)ను ఇప్పటికే 40కి పైగా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఇది వైరస్ మళ్లీ బలపడకుండా అడ్డుకుంటుంది.
భారత్‌లో 2014 తర్వాత పోలియో కేసులు నమోదు కానప్పటికీ, పొరుగు దేశాల్లో వైరస్ ఆనవాళ్లు ఉండటంతో మనం అజాగ్రత్తగా ఉండకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
