ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..? 

సాక్షి లైఫ్ : ప్లాస్టిక్ బాటిళ్లను నీరు నిల్వ చేయడానికి, తాగడానికి వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లకు వేడి తగిలితే, డయాక్సిన్, బైఫినయిల్ "ఏ", థాలేట్స్ వంటి హానికరమైన రసాయనాలు కరిగి నీటిలో కలుస్తాయి. ఇవి రొమ్ము క్యాన్సర్, మధుమేహం, రోగనిరోధక శక్తి సమస్యలు, కాలేయ క్యాన్సర్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

 

ఇది కూడా చదవండి..ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు ప్రమాదకరం ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..ఎబోలా వైరస్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శాకాహారులకు మెదడు పనితీరును పెంచే ఆహారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు.. 

ఇది కూడా చదవండి..డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

 

దీర్ఘకాలంగా ఈ రసాయనాలకు గురైనప్పుడు శరీరంపై తీవ్రమైన ప్రభావాలు పడతాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి, పరిశోధకులు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు కాపర్, గ్లాస్, స్టెయిన్‌లెస్ స్టీల్, మట్టి బాటిళ్లను వాడాలని సూచిస్తున్నారు.


రొమ్ము క్యాన్సర్.. 

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కు ఎండ తగిలినప్పుడు డయాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ డయాక్సిన్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుంది.

మధుమేహం.. 

ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల కూడా మధుమేహం వస్తుంది. వాస్తవానికి, బైఫినైల్ "ఏ" అనేది ఈస్ట్రోజెన్ అనుకరించే రసాయనం. ఇది మధుమేహం, స్థూలకాయం, పునరుత్పత్తి సమస్యలతోపాటు, పలురకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి కారణమవుతుంది.

రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ బాటిళ్లతో  తయారైన రసాయనాలతో కూడిన నీటిని తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.

కాలేయ క్యాన్సర్.. 

ప్లాస్టిక్‌లో లభించే థాలేట్స్ అనే రసాయనాలు కాలేయ క్యాన్సర్‌కు కారణమవుతాయి. అంతేకాదు వీటివల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా  తగ్గుతుంది.

ప్లాస్టిక్ బాటిల్ కు బదులు.. 

ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల తలెత్తే హానికరమైన ప్రభావాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్లాస్టిక్ బాటిల్స్ కు ప్రత్యామ్నాయంగా ఇతర బాటిళ్లను వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా కాపర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్,స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను వినియోగించవచ్చని వారు వెల్లడిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ఇది కూడా చదవండి.. ఆయుర్వేదం చికిత్స రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా ఎలా సమతుల్యం చేస్తుంది..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : blood-cancer stomach-cancer breast-cancer plastic-bottle-side-effects cervical-cancer skin-cancer drinking-water plastic-bottles drinking plastic-wrap plastic oral-cancer milk-plastic-bottles-are-not-safe-for-babies plastic-bottle milk-plastic-bottles milk-in-plastic-bottles milk-plastic-bottle-price is-plastic-water-bottle-safe carbon-dioxide chemical-hazards plastic-ban plastic-sheets plastic-usage plastic-ban-enforcement
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com