టూత్‌పేస్ట్‌లో హెవీ మెటల్స్‌కు ప్రధాన కారణాలు..? 

షేర్ చేయండి:
టూత్‌పేస్ట్‌లో హెవీ మెటల్స్‌కు ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : కొన్ని టూత్‌పేస్ట్‌లలో ఉపయోగించే కృత్రిమ రంగులు, రసాయనాలు, లేదా తయారీ సమయంలో కలుషితమైన నీరు ఈ హెవీ మెటల్స్‌కు కారణం కావచ్చు. చౌకగా ఉత్పత్తి చేసే కొన్ని బ్రాండ్లు నాణ్యతా పరీక్షలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నివేదికలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి.. 

ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?

ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?

 

 ఏం చేస్తే బెటర్ అంటే..? 

 లేబుల్‌ను తనిఖీ చేయండి : టూత్‌పేస్ట్ కొనే ముందు పదార్థాల జాబితాను చదవండి. సేంద్రీయ లేదా హెవీ మెటల్ రహిత టూత్‌పేస్ట్‌లను ఎంచుకోండి. సర్టిఫైడ్ బ్రాండ్లు : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఏ) వంటి సంస్థల ద్వారా ధృవీకరించిన బ్రాండ్లను మాత్రమే ఎంచుకోండి. సహజ ఉత్పత్తులు : బేకింగ్ సోడా, కొబ్బరి నూనె, లవంగ నూనె వంటి సహజ పదార్థాలతో తయారైన టూత్‌పేస్ట్‌లను వాడండి.  

 పిల్లలకు వాడే టూత్‌పేస్ట్‌లో జాగ్రత్త : పిల్లలు టూత్‌పేస్ట్‌ను మింగే అవకాశం ఉంటుంది కాబట్టి, వారికి హెవీ మెటల్ రహిత ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం. టూత్‌పేస్ట్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. హెవీ మెటల్స్ వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా, నాణ్యమైన,  సురక్షితమైన ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయంపై అవగాహన పెంచుకుని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 

ఇది కూడా చదవండి..న్యూట్రిషనిస్ట్ - డైటీషియన్ మధ్య తేడా ఏమిటో తెలుసా..?

ఇది కూడా చదవండి..వేసవికాలంలో నీరసంగా లేకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం అవసరం..? 

ఇది కూడా చదవండి..మలేరియా రహిత దేశంగా ప్రత్యేక చర్యలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.