ఎంపాక్స్ లక్షణాలను ఎలా గుర్తించాలి..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లైతే..కొన్ని వారాల తర్వాత ఎంపాక్స్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. "ఎంపాక్స్" నే "మంకీపాక్స్" అనికూడా అంటారు. ఈ వ్యాధి సోకిన సమయంలో దద్దుర్లు, జ్వరం, అలసట, తలనొప్పి, చలి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా శరీరంపై ఎర్రటి మచ్చల రూపంలో దద్దుర్లు కూడా వస్తాయి. ఇవి చీముతో కూడిన బొబ్బలుగా మారుతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ బొబ్బలు మిగిలిపోతాయి.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?
ఎంపాక్స్ అనేక విధాలుగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా సోకిన చర్మం లేదా నోరు లేదా జననేంద్రియాల నుంచి వచ్చే ద్రవంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాదు ముఖాముఖి మాట్లాడటం లేదా దగ్గరగా శ్వాస తీసుకోవడం ద్వారా ఆ గాలి సోకడంవల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మంకీపాక్స్ వైరస్‌తో బాధపడేవారు ఎక్కువగా 2-4 వారాల్లో కోలుకునే అవకాశం ఉంటుంది.
నివారణ కోసం ఏమి చేయాలి..?
ఒక వ్యక్తికి ఎం పాక్స్ వైరస్ ఉంటే, అతను ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. ఆహారం తినే ముందు, తర్వాత సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దద్దుర్లు నయమయ్యే వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. నోటిలో పుండ్లు నుంచి ఉపశమనం పొందడానికి, ఉప్పు నీటితో పుక్కిలించాలి. శరీరంపై వచ్చిన దద్దుర్లకు వైద్యులు అందించిన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
