బ్రెయిన్ ఎన్యోరిజం లక్షణాలు ఎలా ఉంటాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బ్రెయిన్ ఎన్యోరిజంతో తాను బాధపడుతున్నట్లు సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ఇలాంటి బాలీవుడ్ స్టార్స్ వంటి ప్రముఖులు తమ ఆరోగ్య సమస్యలను బహిరంగంగా వెల్లడించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రెయిన్ ఎన్యోరిజం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి, తక్షణ చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడొచ్చు.

 

 ఇది కూడా చదవండి..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బ్రెయిన్ ఎన్యోరిజం.. 

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

  ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

అకస్మాత్తుగా, తీవ్రమైన తలనొప్పి: ఇది బ్రెయిన్ ఎన్యోరిజం పగిలినప్పుడు కనిపించే ప్రధాన లక్షణం. ఆ సమయంలో తీవ్రమైన హెడేక్ వస్తుంది. 

కళ్ళ వెనుక నొప్పి లేదా ఒత్తిడి: ఇది కంటి దృష్టిపై ప్రభావం చూపవచ్చు.
ద్వి దృష్టి (Double Vision): వస్తువులు రెండుగా కనిపించడం.

దృష్టి కోల్పోవడం: కొన్ని సందర్భాలలో పూర్తి లేదా పాక్షిక దృష్టి కోల్పోవచ్చు.

మెడలో దృఢత్వం: మెడ కండరాలు బిగుసుకుపోవడం.
వికారం లేదా వాంతులు: తీవ్రమైన తలనొప్పితో పాటు వచ్చే అవకాశం ఉంది.

మూర్ఛ: స్పృహ కోల్పోవడం.

మూర్ఛలు (Seizures): కండరాల సంకోచాలను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మూర్ఛలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

 

 ఇది కూడా చదవండి..బ్రెయిన్ ఎన్యోరిజం అంటే ఏమిటి..? దీనిని 'సైలెంట్ కిల్లర్'గా ఎందుకు పిలుస్తారు? 

 ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

 ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.