మంకీ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

సాక్షి లైఫ్ : జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధి 'మంకీ ఫీవర్'. ఇది ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్. దీనిని క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది కోతుల ద్వారా వ్యాపిస్తుంది. కోతులను కుట్టిన దోమలు, ఇతరకీటకాలు మనిషికి కుడితే తద్వారా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. 1957లో తొలిసారిగా ఈ జ్వరాన్ని గుర్తించారు. ఈ వ్యాధికి కర్ణాటకలోని క్యాసనూర్ జిల్లా పేరు పెట్టారు. 


మంకీ ఫీవర్ లక్షణాలు 

- తీవ్ర జ్వరం

- చలిగా అనిపించడం

- కండరాలలో నొప్పి

- తలనొప్పి 

- వాంతులు

- రక్తస్రావం సమస్య

- ప్లేట్‌లెట్స్ పడిపోవడం

- కంటి నొప్పి, వాపు

  ఎలా నిరోధించవచ్చు..?

ప్రస్తుతం మంకీ ఫీవర్ ఉన్నవారికి ఒక నెలలో రెండు మోతాదులలో టీకా ఇస్తారు. అడవుల్లో లేదా అడవుల చుట్టుపక్కల నివసించే వ్యక్తులకు ఈ వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి అటవీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జంతువులతో సంబంధాన్ని నివారించడంతోపాటు శుభ్రంగా ఉండడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని కొంతవరకు నివారించవచ్చు.

ఇది కూడా చదవండి.. కర్ణాటకలో 'మంకీ ఫీవర్ ' కేసులు   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : monkey-fever
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com