సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్ నుంచి రక్షణ పొందాలంటే ఎలాంటి మార్గాలు అనుసరించాలి..?  

షేర్ చేయండి:
సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్ నుంచి రక్షణ పొందాలంటే ఎలాంటి మార్గాలు అనుసరించాలి..?  

సాక్షి లైఫ్ : సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్ నుంచి ముప్పు నుంచి మనల్ని మనం, మన ప్రియమైన వారిని రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు: పొగతాగడం మానేయండి: పొగతాగేవారు ఈ అలవాటును మానేయడం ద్వారా వారి ఆరోగ్యానికి మాత్రమే కాదు, చుట్టూ ఉన్నవారి ఆరోగ్యానికి కూడా మేలు చేసినవారవుతారు.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

ఇంట్లో పొగతాగవద్దు: ఇంటి లోపల పొగతాగడం వల్ల ఆ పొగ ఇంట్లో అన్ని గదులలో వ్యాపించి, పిల్లలు, పెద్దలు అందరికీ హానికరం. కాబట్టి ఇంట్లో పొగతాగవద్దు. వాహనాల్లో పొగతాగవద్దు: వాహనాల్లో పొగతాగడం వల్ల పొగ వేగంగా వ్యాపిస్తుంది, ఇది అత్యంత ప్రమాదకరం, ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు.

పిల్లలకు పొగ గురించి తెలియజేయండి: పొగ తాగడం వల్ల కలిగే నష్టాలను పిల్లలకు వివరించండి, తద్వారా వారు పొగకు దూరంగా ఉంటారు.
పొగతాగిన తర్వాత శుభ్రత: పొగతాగిన తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకోవడం, దుస్తులు మార్చుకోవడం వల్ల పొగ మిగుళ్లు తగ్గుతాయి.

పొగ మానడానికి సహాయం తీసుకోండి: పొగ మానడం కష్టమైనప్పటికీ, వైద్యులను సంప్రదించి సహాయం పొందడం ద్వారా ఈ అలవాటును పూర్తిగా వదిలించుకోవచ్చు.

సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను తగ్గించడానికి, ఈ సూచనలను పాటించడం ద్వారా  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు.

ఇది కూడా చదవండి..రక్త కణాల ఉత్పత్తిలో కాపర్ పాత్ర..?

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.