ఆల్కహాల్ తాగనివారిలో ఫ్యాటీ లివర్‌కు కారణమేమిటి..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మన దేశంలో కాలేయ క్యాన్సర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ఇది మూడవ ప్రధాన కారణం. భారతదేశంలో కూడా కాలేయ క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో కాలేయ క్యాన్సర్ రోగుల సంఖ్య మరింతగా ఢిల్లీలో ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కాలేయ క్యాన్సర్ గురించి ప్రజలలో అవగాహన ముఖ్యం. తద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం ద్వారా ఆయా సమస్య నుంచి పూర్తిగా బయట పడొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఆటలమ్మకు షింగిల్స్‌కు లింకేమిటి..?
ఇది కూడా చదవండి..లివర్ క్యాన్సర్ కు శస్త్రచికిత్స లేకుండా చికిత్స..
ఇది కూడా చదవండి..ఢిల్లీ ఎయిమ్స్‌లో చౌకగా బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్..
ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు..
కాలేయ క్యాన్సర్ పెరగడానికి కారణాలు ఏమిటి..?
హెపటైటిస్ బి ,హెపటైటిస్ సి కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఇప్పుడు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ తీసుకోవడం కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. దేశంలో మూడొంతుల మంది, ఢిల్లీలో దాదాపు 50 శాతం మంది ప్రజలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు.
ఆల్కహాల్ తాగనివారిలో ఫ్యాటీ లివర్‌కు కారణాలు..?
ఫ్యాటీ లివర్ కు చాలా కారణాలున్నాయి. జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాల వాడకం, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అంతే కాకుండా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడంతోపాటు కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది.
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
