ఆటలమ్మకు షింగిల్స్‌కు లింకేమిటి..?

సాక్షి లైఫ్ : చిన్నప్పుడు మీకు ఆటలమ్మ సోకిందా? మీ వయసు యాభై దాటిందా? మధుమేహం బారిన పడ్డారా? అయితే ఆరోగ్యపరంగా మీరు ఇంకో జాగ్రత్త కూడా తీసుకోవాలి. షింగిల్స్‌ రాకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ఆటలమ్మకు, షింగిల్స్‌కు సంబంధం ఏమిటనేది..? ఇప్పుడు తెలుసుకుందాం..  

ఆటలమ్మ లేదా చికెన్‌ పాక్స్‌ అనేది వరిసిల్లా జోస్టర్‌ అనే వైరస్‌ కారణంగా వస్తుందన్నది మనకు తెలుసు. ఒకసారి ఆటలమ్మ సోకిన తరువాత మీకు నయమైనప్పటికీ జోస్టర్‌ శరీరంలోనే నిద్రాణంగా ఉండిపోతూంటుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు మళ్లీ మేల్కొని నొప్పిగా ఉండే దుద్దురు రూపంలో బయటపడుతూంటుంది. ఈ నొప్పి దుద్దరు మానిపోయిన తరువాత కూడా నెలల నుంచి ఏళ్లపాటు ఉండవచ్చు. అలాగని ఈ షింగిల్స్‌ కేవలం ఆటలమ్మ సోకిన వారికి మాత్రమే మళ్లీ వస్తుందని కాదు. ఎవరికైనా సోకవచ్చు కానీ, ఆటలమ్మ ఉన్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

వయసు పెరుగుతున్న కొద్దీ..

వయసు పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం సన్నగిల్లుతోంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీ వయసు యాభై ఏళ్లు దాటిందంటే వరసిల్లా జోస్టర్‌ కోసం పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు అశ్విని ఐడీ క్లినిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మేకా సత్యనారాయణ. కాబట్టి యాభై ఏళ్లు దాటిన వారు షింగిల్స్‌ నివారణ కోసం వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. టీకా వేయించుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి రాకుండా నియంత్రించుకోవచ్చునని చెబుతున్నారు. 

షింగిల్స్‌ వచ్చేందుకు ఉన్న అవకాశం మధుమేహ బాధితులకూ ఎక్కువే. అలాగే ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, రోగ నిరోధక వ్యవస్థను మందుల ద్వారా అణచి ఉంచుతున్న వారికి  కూడా ఈ వ్యాధి రావచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసరమని తద్వారా షింగిల్స్‌ రాకుండా కొంత వరకూ అడ్డుకోవచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : shingles shingles-treatment shingles-rash shingles-symptoms shingles-vaccine prevent-shingles shingles-virus shingles-pain shingles-on-face shingles-causes what-is-shingles shingles-diagnosis shingles-cause early-signs-of-shingles shingles-signs-and-symptoms how-to-treat-shingles is-shingles-contagious what-does-shingles-look-like
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com