బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి మార్పులు అవసరం..?  

షేర్ చేయండి:
బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి మార్పులు అవసరం..?  

సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులో రక్తప్రవాహం ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల మెదడు కంట్రోల్ చేసే కొన్ని శరీర భాగాలపై ప్రభావం పడుతుడుతుంది. ఇది అత్యంత మానసిక, శారీరక సమస్యలకు దారి తీస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు కొన్ని జీవనశైలి మార్పులు చేయడం చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అటువంటి వాటిలో.. 
 
ధూమపానం.. 

ధూమపానం చేసే అలవాటు ఉన్నవారి మెదడులో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వెంటనే ధూమపానం మానేయడం మంచిది.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

బరువు..  

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఊబకాయం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక బరువు అధిక రక్తపోటు,మధుమేహం వంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
 

ఒత్తిడి ..  

 మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, అది మీకు ప్రమాదం. ఎందుకంటే ఒత్తిడి వల్ల బీపీ పెరుగుతుంది. ఇది స్ట్రోక్‌కు కారణమవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ధ్యానం, వ్యాయామం, యోగా చేయండి.

ఆరోగ్యకరమైన ఆహారం..  

 స్ట్రోక్‌ను నివారించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందులోభాగంగా అవిసె గింజలు, వాల్‌నట్స్, సోయాబీన్స్ వంటివాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే..? వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. చక్కెర తీసుకోవడం తగ్గించండి. ఆహారంలో తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు,తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి.

 

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.