ఎలాంటి ఆహార పదార్థాలు నిమోనియాను నివారిస్తాయి..? 

షేర్ చేయండి:
ఎలాంటి ఆహార పదార్థాలు నిమోనియాను నివారిస్తాయి..? 

సాక్షి లైఫ్ : పెరుగుతున్న నిమోనియా కేసుల దృష్ట్యా, ఈ వ్యాధిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాధిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి ఉంటుంది. బలహీనత, ఊపిరితిత్తులలో వాపు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడంలో కొన్నిరకాల ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటంటే..?   


 నిమోనియాను నివారించడంలో.. 

 ఊపిరితిత్తులలో వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును నిమోనియా అంటారు. ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులు ద్రవంతో నిండుతాయి. దీని వల్ల జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిమోనియా కారణంగా శరీరం బలహీనంగా అనిపించవచ్చు.  

 

ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు..?

ఇది కూడా చదవండి.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎర్గోనామిక్ ఫర్నిచర్ పాత్ర.. ?

ఇది కూడా చదవండి.. ఓరల్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. పిల్లలకు ఇచ్చే టీకాల ప్రాముఖ్యత తెలుసా..?

 

ఇది కూడా చదవండి.. మందులతో పనిలేకుండా ఫ్యాటీ లివర్ తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి.. స్పైసీ ఫుడ్స్ తినడం ద్వారా బరువు తగ్గొచ్చా..? 

 తేనె.. 

తేనె జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నిమోనియా నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇది శ్లేష్మం తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

తృణధాన్యాలు.. 

తృణధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నిమోనియా సాధారణ లక్షణాలలో ఒకటి అలసట, ఈ సమస్యను తొలగించడంలో తృణధాన్యాలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్.. 

పచ్చి కూరగాయాల వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.  వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ బలహీనతను దూరం చేయడంలో మేలు చేస్తాయి.

వెల్లుల్లి.. 

వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్ ,యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

నీరు.. 

నీటి కొరత కారణంగా, శ్వాసనాళంలో ఉన్న శ్లేష్మం పొర మందంగా మారుతుంది, ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల నీరు ఎక్కువగా తాగాలి.

డ్రై ఫ్రూట్స్.. 

డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి, ఇవి నిమోనియా వల్ల కలిగే ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, దెబ్బతిన్న కణజాలాల స్థానంలో కొత్త కణజాలాలను రూపొందించడంలో ఇవి సహాయపడుతాయి. 

 

ఇది కూడా చదవండి.. పిల్లలకు ఇచ్చే రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి..?

ఇది కూడా చదవండి.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?

 

ఇది కూడా చదవండి.. డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.