HKU5-CoV-2 అంటే ఏమిటి..? ఇది కరోనా వైరస్ ని పోలి ఉంటుందా..?

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా జంతువులకు సోకే అనేక కరోనావైరస్లు ఉన్నాయి, కానీ కొత్తగా కనుగొన్న వైరస్ COVID-19 వైరస్ లాగానే జంతువుల నుంచి మానవులకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, ఇప్పటివరకు కొత్త కరోనావైరస్ ప్రయోగశాలలో మాత్రమే గుర్తించారు. ఇంకా ఇది మనుషులలోరాలేదు.

 

కొత్త వైరస్ ఇన్ఫెక్షన్‌కు ఎలా కారణమవుతుంది..?

ఈ కొత్త వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా లాలాజలం, మూత్రం లేదా మలం వంటి గబ్బిలాల స్రావాల ద్వారా లేదా వాటికి దగ్గరగా ఉండడం ద్వారా వ్యాపిస్తుంది.

HKU5-CoV-2 అంటే ఏమిటి..?


HKU5-CoV-2 అనేది మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందిన కరోనావైరస్, ఇందులో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) కు కారణమయ్యే వైరస్ కూడా ఉంటుంది. ఈ కొత్త వైరస్ మానవ ACE2 తో బంధించగలదని, ఇది SARS-CoV-2, NL63 సాధారణ జలుబు వైరస్ లాగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా కొత్త వైరస్ కొత్త మహమ్మారిని కలిగిస్తుందా..?

జంతువులలో వందలాది కరోనావైరస్లు కనిపిస్తాయి, అయితే వాటిలో కొన్నింటిలో మాత్రమే మానవులకు సోకుతాయి. SARS, MERS, SARS-CoV-2 వంటి వైరస్‌లు మానవాళికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. కొత్త HKU5-CoV-2 అనేది మెర్బెకోవైరస్ సమూహానికి చెందిన కరోనావైరస్ అని  MERS తో దగ్గరి సంబంధం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే, 2019 వేరియంట్ కంటే ఇలాంటి SARS వైరస్‌లకు ప్రజలు చాలా ఎక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటే ఇది మహమ్మారి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

 

ఇది కూడా చదవండి..HKU5-CoV-2 : చైనాలో మరో కరోనా కొత్త వైరస్.. అదీ అంటువ్యాధేనా..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

గమనికఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

Tags : corona-cases corona-latest-updates latest-corona-cases corona-positive covid-19 corona-new-variant corona-virus corona virus-spread-china china-virus-update china-mysterious-virus-outbreak hku5-cov-2 new-coronavirus hku5-cov-2-pandemic bat-coronavirus covid-19-similarity coronavirus-research wuhan-institute-of-virology coronavirus-outbreak coronavirus-mutation covid-19-variants
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com