స్లీప్‌మాక్సింగ్ అంటే ఏమిటి..? ఈ ట్రెండ్ ఆరోగ్య సమస్యగా ఎలా మారుతుంది..?
సాక్షి లైఫ్ : ప్రస్తుత తరంలో మారిన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా చాలామంది సరిపడా నిద్ర పొందలేక పోతున్నారు. మంచి నిద్రకోసం నానా రకాల పాట్లు పడుతున్నారు. నేటి యువతరంలో ముఖ్యంగా సమయానికి తినలేకపోవడం, సమయానికి సరైన నిద్ర పొందలేకపోతున్నారు. స్మార్ట్ ఫాన్స్ అందుబాటులోకి వచ్చాక స్క్రీన్ టైం పెరగడం కూడా నిద్రలేమికి ప్రధాన కారణం.
ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..
ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్..
దీంతో సరైన నిద్ర పొందడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు కొందరు. అందులోభాగంగానే నాణ్యమైన నిద్ర పొందడానికి ప్రత్యేక ఆహారాలు తీసుకుంటున్నారు. అంతేకాదు స్పెషల్ గా మెట్రెస్, హైటెక్ స్లీప్ ట్రాకర్, బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్, బయోహ్యాకింగ్ వంటివి నిద్ర కోసం వినియోగిస్తున్నారు. నేటితరం యువత ఈ కొత్త ట్రెండ్ నే "స్లీప్‌మ్యాక్సింగ్ ట్రెండ్" అని అంటున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్ ను అనుసరించడం ద్వారా వారు నాణ్యమైన నిద్రను కోరుకుంటున్నారు. ఆరోగ్యం, పనితీరు లేదా శ్రేయస్సును మెరుగుపరచడానికి శరీరం లేదా జీవనశైలిలో మార్పులు చేసే పద్ధతినే బయోహ్యాకింగ్ అంటారు. ఇందులో సాంకేతికత, మందులు లేదా ఇతర రసాయన పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.
స్లీప్‌మాక్సింగ్ ట్రెండ్ ను ఫాలో అవ్వడం వల్ల భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, నిద్ర కృత్రిమంగా కాకుండా సహజంగా పడితేనే ఆరోగ్యమని లేదంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
