Planetary Health Diet : ప్లానెటరీ హెల్త్ డైట్ అంటే ఏమిటి..? ఇది ఎలా ఉపయోగపడుతుంది..? 

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది పెద్దలను వేధిస్తున్న దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ముప్పును సరైన ఆహారపు అలవాట్లతో అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే 'ఈట్-లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ డైట్' (EAT-Lancet Diet) పాటించడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 2040 నాటికి మరణాలకు దారితీసే ఐదవ ప్రధాన కారణం కిడ్నీ వ్యాధులే అవుతాయని అంచనా వేస్తున్న తరుణంలో ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?


  పరిశోధనలోని ప్రధాన అంశాలు..  

కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ (CMAJ)లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం, యూకే బయోబ్యాంక్‌కు చెందిన సుమారు 1.8 లక్షల మంది డేటాను 12 ఏళ్ల పాటు విశ్లేషించారు. ఇందులో తేలిన ఆసక్తికర అంశాలు ఏమిటంటే..?

శాకాహారానికి ప్రాధాన్యం.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ.. రెడ్ మీట్, కృత్రిమ చక్కెరలను పరిమితం చేసేవారిలో కిడ్నీ సమస్యలు తక్కువగా వస్తున్నాయి. ఇన్‌ఫ్లమేటరీ ఆహార పదార్థాలను తగ్గించడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతినకుండా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం శరీరంలోని జీవక్రియలు (Metabolism), ప్రొటీన్ల సమతుల్యతపై ప్రభావం చూపి కిడ్నీలను రక్షిస్తుంది.

ఏమిటీ ప్లానెటరీ హెల్త్ డైట్..?

ఈ ఆహార ప్రణాళిక కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, భూగోళంపై పర్యావరణ ప్రభావం తగ్గించేలా రూపొందించబడింది. ఇందులో ప్రధానంగా:

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారం, పంచదార వంటివి తక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, పప్పు దినుసులు, కాయగూరలు, నట్స్ వంటివి ఎక్కువగా తినాలి.

ముప్పు ఎవరికి ఎక్కువ అంటే.. ?

పరిశోధనలోభాగంగా కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారిని గమనించినప్పుడు కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి.

ఎక్కువ వయసు ఉన్నవారు, ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు.

అధిక బరువు (High BMI) శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు.

బి.పి (High BP), కొలెస్ట్రాల్ డయాబెటిస్ నియంత్రణలో లేనివారు.

ఆహార నాణ్యత అనేది మనం మార్చుకోగలిగే అంశం. డ్యాష్ (DASH), మెడిటరేనియన్ డైట్ వంటి పద్ధతులతో పాటు ఈ ప్లానెటరీ డైట్‌ను అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kidneys healthy-kidney kidney-failure kidney-related-problems kidney-transplant kidney-disease-symptoms the-lancet chronic-kidney-disease-(ckd)
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com