సాక్షి లైఫ్ : బరువు తగ్గడానికి ఇప్పుడు రకరకాల డైట్ ప్లాన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కీటో, పేలియో డైట్‌ల తర్వాత ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా 'కార్నివోర్ డైట్' గురించే చర్చ నడుస్తోంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను పూర్తిగా పక్కన పెట్టి.. కేవలం మాంసాహారం మాత్రమే తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. అయితే, వైవిధ్యమైన ఆహార సంస్కృతి కలిగిన భారతీయులకు ఈ పద్ధతి ఎంతవరకు శ్రేయస్కరం..? నిపుణులు ఏమంటున్నారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
అసలు ఏమిటీ 'కార్నివోర్ డైట్'..?
సాధారణంగా సమతుల్య ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు అన్నీ ఉంటాయి. కానీ ఈ కార్నివోర్ డైట్ మాత్రం అందుకు భిన్నం.
ఏం తినాలి..? రెడ్ మీట్, చేపలు, కోడిగుడ్లు, వెన్న, నెయ్యి వంటి జంతు సంబంధిత ఆహార పదార్థాలు మాత్రమే.
ఏమి తినకూడదు..? పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యం, గోధుమలు, నట్స్.. చివరికి టీ, కాఫీలు తీసుకోకూడదు..
'కార్నివోర్ డైట్'లో ఏమేం ఉంటాయి..?
మన భారత దేశ వాతావరణం, అలవాట్ల దృష్ట్యా ఈ డైట్‌ను పాటించడం సవాలుతో కూడుకున్న పని అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే..?భారతీయుల భోజనంలో ఉండే కూరగాయలు, పప్పులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కేవలం మాంసమే తింటే శరీరానికి అందాల్సిన పీచు పదార్థాలు అందవు. దీని కారణంగా తీవ్రమైన మలబద్ధకం, జీర్ణకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
రోజుకు మూడు పూటలా..
మాంసాహారాన్ని మాత్రమే రోజుకు మూడు పూటలా తీసుకోవడం మధ్యతరగతి భారతీయులకు ఆర్థికంగా భారమే. మన దేశంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు కేవలం మాంసాహారం మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగి డీహైడ్రేషన్ వంటి సమస్యలు రావచ్చు.పండ్లు, కూరగాయల ద్వారా అందే విటమిన్-సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు లోపించి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది.
దుష్ప్రభావాలు..?
అతిగా మాంసం తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే, కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వల్ల దీర్ఘకాలంలో మూత్రపిండాల సమస్యలు తలెత్తవచ్చు.
ఏదైనా ఒక ఆహారాన్ని పూర్తిగా మానేయడం ఆరోగ్యకరం కాదు. మన పూర్వీకుల నుంచి వస్తున్న సమతుల్య ఆహారమే మన శరీర తత్వానికి మంచిది. కేవలం బరువు తగ్గడం కోసమే ఇలాంటి కఠినమైన డైట్లు అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యనిపుణుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ప్రతి డైట్‌ను గుడ్డిగా అనుసరించడం కంటే.. మన వాతావరణ పరిస్థితులకు, శరీర స్థితికి సరిపోయే ఆహారాన్ని ఎంచుకోవడమే ఆరోగ్యం.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com