Latest Research : రోజూ ఒక 5 నిమిషాలు అదనంగా నడిస్తే.. ఆయుష్షు పెంచుకోవచ్చు..

సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం కోసం గంటలు గంటలు కేటాయించలేకపోతున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం 5 నిమిషాల అదనపు నడక మీ ప్రాణాలను కాపాడుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక 'లాన్సెట్' (2026) ప్రచురించిన నివేదిక ప్రకారం, రోజువారీ నడకలో స్వల్ప మార్పులు చేసుకున్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని స్పష్టమైంది.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

 రోజుకు కనీసం 5 నిమిషాలు అదనంగా నడిచే వ్యక్తుల్లో అకాల మరణం సంభవించే ముప్పు 10 శాతం వరకు తగ్గుతుంది. శారీరక శ్రమ తక్కువగా ఉండేవారిలో కూడా ఈ అదనపు నడక వల్ల ప్రాణాంతక ముప్పు 6 శాతం తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

 రోజూ ఒక 5 నిమిషాలు అదనంగా నడిస్తే కలిగే ప్రయోజనాలు..

శారీరక శ్రమను పెంచుకోవడం కష్టమైన పని ఏమీ కాదు. ఈ చిన్న మార్పులతో రోజంతా చురుగ్గా ఉండొచ్చు..

 మొబైల్‌లో మాట్లాడుతున్నప్పుడు ఒకే చోట కూర్చోకుండా, అటు ఇటు తిరుగుతూ మాట్లాడటం అలవాటు చేసుకోండి.

 లిఫ్ట్ లేదా ఎస్కలేటర్లకు బదులుగా వీలైనంత వరకు మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించండి. ఇది కండరాలకు మంచి వ్యాయామం.

భోజనం చేసిన తర్వాత..

మీ వాహనాన్ని ఆఫీసు లేదా షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారానికి కాస్త దూరంగా పార్క్ చేయండి. ఆ కొద్దిపాటి దూరం నడక మీ లక్ష్యానికి తోడ్పడుతుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు వజ్రాసనంలో ఉండటం లేదా నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

 ఆఫీసులో నిరంతరం కూర్చుని పనిచేసేవాళ్లు తప్పనిసరిగా, ప్రతి గంటకు ఒకసారి లేచి 2 నిమిషాల పాటు అటు ఇటు నడవండి. ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నారు పెద్దలు. కేవలం ఐదు నిమిషాల నడకతో మీ జీవితకాలాన్ని పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు, ఆ అడుగు వేయడానికి ఇంకెందుకు ఆలస్యం? ఇవ్వాల్టి నుంచే  ప్రారంభించండి మరి..!

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diet balanced-diet sedentary-lifestyle best-diet longevity-secrets walking walk health-risks-of-prolonged-sitting prolonged-sitting walking-vs-running sedentary-lifestyle-problems sedentary-lifestyle-health-risks
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com