సాక్షి లైఫ్ : మధుమేహం అదుపులో ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మధుమేహం ఉన్నవాళ్లు తినాల్సినవి తినకూడనివి కొన్ని ఉన్నాయి. తినకూడనివి తింటే రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్ల రసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్ని పండ్ల రసాలు మధుమేహ రోగులకు హానికరం. డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి పండ్ల రసాలు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ విషయంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని పండ్లు తినడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ వాటి రసాలు చక్కెరను పెంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..?
డయాబెటిక్ రోగులకు ఏమేం పండ్ల రసాలు హానికరం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు ఏ పండ్ల రసాలు తాగాలి, ఏది తాగకూడదు అనేది తెలుసుకోవడం ద్వారా హెల్తీగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
కొన్ని పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర ఎందుకు పెరుగుతుంది..?
ఫైబర్ లేకపోవడం : మనం పండ్లు తిన్నప్పుడు, ఫైబర్ మన శరీరం గ్లూకోజ్‌ను నెమ్మదిగా గ్రహించడంలో సహాయపడుతుంది. కానీ మనం జ్యూస్ చేసినప్పుడు, ఫైబర్ తగ్గుతుంది. దీని కారణంగా గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది.
అధిక చక్కెర : చాలా పండ్లలో సహజ చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. మనం జ్యూస్ తాగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో చక్కెరశరీరంలోకి వెళుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్ల రసాలను తాగకూడదు..?
అన్ని పండ్లలో చక్కెర ఉన్నప్పటికీ, కొన్ని పండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాంటి పండ్ల రసాలను తాగకుండా ఉండడం ఉత్తమం.
పైనాపిల్: పైనాపిల్‌లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. కాబట్టి దీనిని ముక్కలుగా కోసుకుని తినడం మంచిది. రసాన్ని తాగకపోవడమే మంచిది.
ఆరెంజ్: చాలామంది ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. అయితే ఆరెంజ్ తినడం ద్వారా, దాని ఫైబర్స్ కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. అందువల్ల దాని రసం తాగడంకంటే పండు రూపంలోనే తినడం బెటర్.
యాపిల్: యాపిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో సందేహం లేదు, కానీ దీనిని పండుగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు. ఆపిల్ జ్యుస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది.
ద్రాక్ష: ద్రాక్షలో కూడా అధిక మొత్తంలో చక్కెర ,యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల, దీనిని పరిమిత పరిమాణంలో తినాలి, కానీ దాని రసాన్ని అస్సలు తీసుకోకూడదు.
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com