మైక్రోప్లాస్టిక్స్‌కు గురికాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : మైక్రోప్లాస్టిక్స్‌కు గురికాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వినియో గించాలని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్ సమస్య నుంచి తప్పించుకోవడానికి గాజు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించడం మేలని, ముఖ్యంగా ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో ఎక్కువసేపు నిల్వ చేయకపోవడం,సేంద్రీయ ఆహారాన్ని ఎంచుకోవడం వంటి చర్యలు మైక్రో ప్లాస్టిక్స్ బారీన పడకుండా సహాయపడతాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
మైక్రోప్లాస్టిక్స్‌కు గురికాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనేదానిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించి, మైక్రోప్లాస్టిక్స్ నియంత్రణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. మహిళల ఆరోగ్యం, సంతాన సామర్థ్యం మన సమాజానికి కీలకం. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడడం ద్వారా ఈ సమస్యను కొంతమేర తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు..
ఇది కూడా చదవండి.. ఒత్తిడి ఎన్నిరకాలు..? లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి
