సాక్షి లైఫ్ : కొన్ని వంటకాలు, కూరగాయలను చూడగానే ఆకర్షించే రంగులు.. నోరూరించే రుచి.. ఆధునిక వంటకాల్లో క్యాప్సికమ్ (బెల్ పెప్పర్) పాత్ర ప్రత్యేకమైంది. అయితే, మార్కెట్లో మనకు లభించే పచ్చ, పసుపు, ఎరుపు రంగు క్యాప్సికమ్‌లలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని రంగుల బెల్ పెప్పర్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, వాటిలోని పోషక విలువల పరంగా కొన్ని స్వల్ప తేడాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
రంగును బట్టి పోషకాలు..
క్యాప్సికమ్ రంగు అది ఎంతగా పక్వానికి వచ్చిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనిని బట్టి అందులోని విటమిన్లు మారుతుంటాయి.
ఆకుపచ్చ రంగు (Green)..ఇవి పూర్తిస్థాయిలో పక్వానికి రాకముందే కోస్తారు. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రుచిలో ఇవి కొంచెం ఘాటుగా, వగరుగా ఉంటాయి.
పసుపు రంగు (Yellow)..ఇవి మధ్యస్థంగా పక్వానికి వచ్చినవి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఎరుపు రంగు (Red)..ఇది అన్నింటికంటే ఎక్కువగా పక్వానికి వచ్చిన దశ. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఏ అత్యధిక స్థాయిలో ఉంటాయి. ఒక ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో ఆరంజ్ కంటే రెట్టింపు విటమిన్-సి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
రోగనిరోధక శక్తికి 'రెడ్' బెస్ట్..!
మీరు రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుకోవాలనుకుంటే.. ఎరుపు రంగు బెల్ పెప్పర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. వీటిలో ఉండే 'బీటా కెరోటిన్', విటమిన్-సి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే 'లైకోపిన్' వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.
రెడ్ క్యాప్సికమ్ ఆరోగ్య ప్రయోజనాలు..
రెడ్ క్యాప్సికమ్ లోని విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు దరిచేరవు. అన్ని రకాల బెల్ పెప్పర్లను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రకరకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. అయితే గరిష్ట పోషకాల కోసం ఎరుపు రంగు క్యాప్సికమ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. సలాడ్లు, కూరలు లేదా ఇతర వంటకాల్లో వీటిని భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com