హెచ్ పీవీ టీకా ఎవరెవరు తీసుకోవచ్చు..?  

సాక్షి లైఫ్ : భారతదేశంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్ పీవీ) టీకా తీసుకోవడానికి ప్రభుత్వం అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా   ఆమోదించిందని, ముఖ్యంగా 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన అబ్బాయిలు ఆరు నెలల వ్యవధిలో రెండు మోతాదులు తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు మూడు మోతాదులు తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రెండు నెలల తర్వాత రెండవది, ఆరు నెలల తర్వాత మూడవది తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ 45 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు కూడా తీసుకోవచ్చు. అయితే, 65 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా పాప్ స్మియర్ పరీక్షలు చేయడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడానికి వీలుకలుగుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.

 
9 నుంచి14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అబ్బాయిలకు, ముఖ్యంగా వారు శృంగారంలో పాల్గొనడానికి ముందే టీకాలు వేసుకోవడం ద్వారా హెచ్ పీవీ సంబంధిత క్యాన్సర్‌లను నివారించవచ్చు. వైరస్‌కు గురయ్యే ముందు ఇచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది, దీర్ఘకాలిక రక్షణను నిర్ధారిస్తుంది" అని ఆయన అన్నారు.

హెచ్ పీవీ వ్యాక్సిన్ ధర దాదాపు రూ. 6000, అయితే భారతదేశం స్వదేశీంగా అభివృద్ధి చేసిన సెర్వావాక్ రూ. 2000 కు అందుబాటులో ఉంది. అయితే, దాని సామర్థ్యంపై మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

 
జన్యు పరంగా రొమ్ము, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అధిక ప్రమాదకర జన్యు ఉత్పరివర్తనలు ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 60శాతం ఉండగా, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90శాతం వరకు ఉంటుంది.
 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health stomach-cancer breast-cancer cancer-deaths cervical-cancer skin-cancer cancer-treatment physical-health prostate-cancer cancer-factors risk-of-cancer cancer-risk cervical-pain cervical-cancer-free-vaccine hpv-vaccine-awareness
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com