Cancer Risk Factors : యువతలో క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది..? కారణాలేమిటి..?

షేర్ చేయండి:
Cancer Risk Factors : యువతలో క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది..? కారణాలేమిటి..?

సాక్షి లైఫ్ : ఒకప్పుడు అరవై దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే క్యాన్సర్.. ఇప్పుడు ముప్పై, నలభై ఏళ్ల ప్రాయంలోనే పంజా విసురుతోంది. మునుపటి తరాలతో పోలిస్తే నేటి యువత వేగంగా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ప్రమాదకరమైన క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

మారుతున్న జీవనశైలి.. 

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఈ ముప్పుకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా శుద్ధి చేసిన ఆహారం.. జంక్ ఫుడ్, చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు పెరిగి, పీచు పదార్థం (Fiber) తగ్గడం వల్ల శరీరంలో జీవక్రియలు దెబ్బతింటున్నాయి.

బాల్యం నుంచే ఊబకాయం..చిన్న వయస్సులోనే బరువు పెరగడం వల్ల కొలొరెక్టల్ (పెద్దపేగు), ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి క్యాన్సర్ కణాలు వృద్ధి చెందే అవకాశం ఏర్పడుతోంది. మనం పీల్చే గాలి, తాగే నీరు కూడా క్యాన్సర్‌కు కారకాలుగా మారుతు న్నాయి.

పేగుల్లో ఉండే 'E. coli' వంటి కొన్ని బ్యాక్టీరియాలు DNAను దెబ్బతీసి పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వాయు కాలుష్యం, ఆహారంలో పురుగుమందుల అవశేషాలు, హార్మోన్లను దెబ్బతీసే రసాయనాల వల్ల యువతలో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతున్నారు.

యువతలో పెరుగుతున్న క్యాన్సర్ రకాలు.. 

కొలొరెక్టల్, జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యల కారణంగా పెద్దపేగు క్యాన్సర్ వంటివి పెరుగుతున్నాయి. రొమ్ము , థైరాయిడ్,టెస్టిక్యులర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, లింఫోమా,మెలనోమా క్యాన్సర్, 

స్క్రీనింగ్..

టెక్నాలజీ పెరగడం వల్ల ఇప్పుడు చిన్న వయస్సులోనే క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యమవుతోంది. అయితే, 'బర్త్ కోహోర్ట్' ప్రభావం ప్రకారం.. ప్రతి కొత్త తరం తమ మునుపటి తరం కంటే తక్కువ వయస్సులోనే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గమనించారు.

జాగ్రత్త పడదాం ఇలా..

ఆహారంలో పండ్లు, ఆకుకూరలు,ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఏవైనా అసాధారణ గడ్డలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. వయస్సు తక్కువగా ఉంది కదా అని లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ను సులువుగా అంతమొందించవచ్చు. 

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..

ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.