చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే 5 గ్రీన్ సూపర్‌ఫుడ్స్..
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో హెచ్‌డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలి..లేకుంటే అది అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని ఆహారాల సహాయంతో మీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొన్ని గ్రీన్ సూపర్‌ఫుడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా..? ఈ ఆరు ఆహారాలు తీసుకోండి..
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి, వీటిని హెచ్‌డిఎల్ అని పిలుస్తారు, అంటే మంచి కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. ఎల్‌డిఎల్‌ను తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటారు. ఎందుకంటే ఇది గుండె సంబంధిత వ్యాధులను పెంచుతుంది. సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కాబట్టి వాటిని వీలైనంత వరకూ తగ్గించాలి.
అసంతృప్త కొవ్వును తీసుకోవడం వల్ల హెచ్‌డిఎల్ పరిమాణం పెరుగుతుంది. కాబట్టి హెచ్‌డిఎల్ పరిమాణం పెరిగే విధంగా మనం మన ఆహారాన్ని నిర్వహించాలి. తృణధాన్యాలు, పప్పులు , మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం ద్వారా హెచ్ డి ఎల్ పెరుగుతుంది. మొక్కల ఆధారిత ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు మొదటి స్థానంలో ఉంటాయి. పచ్చి కూరగాయలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పాలకూర, కాలే, బ్రకోలీ, క్యాబేజీ, బ్రస్సెల్ మొలకలు. వంటి గ్రీన్ సూపర్ ఫుడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి
.
ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
