మైదా పిండికి ప్రత్యామ్నాయాలు..?

సాక్షి లైఫ్ : పండుగల సమయంలో మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పిండితోనే అనేక రకాల వంటలు చేస్తారు, కానీ మైదా పిండి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయదనే విషయం అందరికీ తెలిసిందే. మైదా అనేది శుద్ధి చేసిన గోధుమ పిండి, ఇది అతితక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణం కావడం కష్టం. మైదా పిండికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా..? అవేంటి..?  

మైదా అనేది శుద్ధి చేసిన గోధుమ పిండి, దీనిలో ఫైబర్, పోషకాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. దీన్ని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అంతే కాదు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

అందువల్ల, మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే, మైదా పిండితో చేసిన వాటిని మానేయ్యాలి. ఈ పిండికి బదులుగా తృణధాన్యాలు లేదా ఇతర ధాన్యాల నుంచి తయారుచేసిన పోషకమైన పిండి వంటి కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే 5 గ్రీన్ సూపర్‌ఫుడ్స్.. 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా..? ఈ ఆరు ఆహారాలు తీసుకోండి.. 

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

పిండికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు.. 

 
బార్లీ పిండి:  బార్లీ పిండిలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని రోటీగా, గంజిగా లేదా బ్రెడ్‌గా ఉపయోగించవచ్చు.


రాగుల పిండి : రాగులను ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. రాగుల పిండిని మైదా పిండికి బదులుగా వాడొచ్చు. ఇందులో ఇనుము, ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. గ్లూటెన్ రహితంగా ఉంటుంది కాబట్టి సులభంగా జీర్ణమవుతుంది. ఈ రాగుల పిండిని రోటీలు, ఇడ్లీలు, దోసెలు, కుకీలు, బిస్కెట్లు, కేకులు తయారీకి కూడా ఉపయోగించవచ్చు. ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ , అధిక ఫైబర్ కంటెంట్  కలిగి ఉంటుంది. 

కొబ్బరి పిండి:  కొబ్బరి పిండి గ్లూటెన్-ఫ్రీ, తక్కువ కార్బ్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో అవసరమైన ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది. 

బ్రౌన్ రైస్ పిండి - బ్రౌన్ రైస్ పిండిలో గ్లూటెన్ ఉండదు, ఫైబర్, మెగ్నీషియం , విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును నిర్వహించడానికి ,జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా రోటీలు, స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.

బాదం పిండి - బాదం పిండిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో నూ, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని స్వీట్ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.

 

ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : maida-alternatives healthy-flour-substitutes whole-wheat-flour almond-flour coconut-flour oat-flour brown-rice-flour quinoa-flour sorghum-flour buckwheat-flour gluten-free-flour chickpea-flour millet-flour flour-for-baking nutritional-flour-options flour-substitutes-for-cooking plant-based-flour low-carb-flour-alternatives nut-flours dietary-alternatives-to-maida
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com