High Temperatures : అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఇలాంటి ఆహారమే మీ ఆరోగ్యానికి మంచిది..  

సాక్షి లైఫ్ : ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో అజాగ్రత్తగా ఉంటే అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో సహజ సమతుల్యత దెబ్బతినకుండా, వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లలో కొన్ని కీలక మార్పులు చేసుకోవాలి. ఆయుర్వేద, పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం ఈ వేసవిలో 'ఏమి తినాలి? ఏమి తినకూడదు?' అనే అంశంపై ప్రత్యేక కథనం..

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

 దూరంగా ఉండాల్సినవి..?

వేసవిలో మన జీర్ణవ్యవస్థ కాస్త బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నూనెలో బాగా వేయించిన పదార్థాలు, ఘాటైన మసాలాలు శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా పెంచుతాయి. ఇవి ఎసిడిటీకి, అజీర్తికి కారణమవుతాయి.

కెఫిన్ ప్రభావం.. టీ, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగడం వల్ల మూత్ర విసర్జన పెరిగి, శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శీతల పానీయాలు (Cool Drinks), ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల తాత్కాలికంగా చల్లగా అనిపించినా.. అందులోని అధిక చక్కెర బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు మారడానికి దారితీస్తుంది.

నిల్వ ఉంచిన ఆహారం.. వేసవిలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి బయట అమ్మే కట్ చేసిన పండ్లు, నిల్వ ఉంచిన పదార్థాలు తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

   తీసుకోవాల్సిన ఆహారం.. 

శరీరాన్ని లోపలి నుంచి చల్లబరిచేందుకు ప్రకృతి మనకు అద్భుతమైన ఫలాలను అందించింది. 90 శాతం నీరు ఉండే పుచ్చకాయ, దోసకాయ, కర్బూజా వంటి పండ్లను రోజూ తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. కొబ్బరి నీరు, పల్చటి మజ్జిగ, ఇంట్లో తయారుచేసిన నిమ్మరసం అత్యుత్తమ ఎలక్ట్రోలైట్లుగా పనిచేస్తాయి.

తేలికపాటి భోజనం..

మొలకెత్తిన ధాన్యాలు, ఆకుకూరలు, తక్కువ నూనెతో చేసిన ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది. తీవ్రమైన వేడి వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దాహం వేయకపోయినా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. అతి చల్లని నీటి కంటే, కుండలో నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bad-food summer-health-tips best-food best-diabetes-diet best-diet best-bottle best best-fruit best-for-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com