Dehydration : శరీరంలో 65శాతం నీరున్నా డీహైడ్రేషన్ అవ్వడానికి కారణం ఏంటి..? 

షేర్ చేయండి:
Dehydration : శరీరంలో 65శాతం నీరున్నా డీహైడ్రేషన్ అవ్వడానికి కారణం ఏంటి..? 

సాక్షి లైఫ్ : మన శరీరంలో సింహభాగం నీరే ఉంటుంది. కండరాలు, రక్తం, మెదడు.. ఇలా ప్రతి అవయవం పనితీరులో నీటిదే కీలక పాత్ర. మరి అంత నీరు ఉన్నప్పుడు, కేవలం ఎండ తగిలితేనో లేదా నీళ్లు తాగడం కాస్త తగ్గితేనో శరీరం ఎందుకు నీరసించిపోతుంది..? ఆ '65 శాతం' నీరు మనల్ని ఎందుకు కాపాడదు..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

శరీరంలో నీరు ఎక్కడ ఉంటుంది అంటే..?

మన శరీరంలోని నీరు కేవలం ఒకచోట నిల్వ ఉండదు. ఇది ప్రధానంగా రెండు రూపాల్లో పంపిణీ అయి ఉంటుంది.కణాల లోపల (Intracellular Fluid)..దాదాపు మూడింట రెండు వంతుల నీరు కణాల లోపలే ఉంటుంది.కణాల వెలుపల (Extracellular Fluid)..మిగిలిన నీరు రక్తం, కణాల మధ్య ఖాళీలలో ఉంటుంది. మనం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, మొదట రక్తంలోని, కణాల బయట ఉన్న నీటిని శరీరం కోల్పోతుంది. ఇది రక్త ప్రసరణపై ప్రభావం చూపిస్తుంది.

వేసవిలో అసలేం జరుగుతుంది..?

సాధారణ ఉష్ణోగ్రత వద్ద మన శరీరం మూత్రం, శ్వాస, చెమట ద్వారా నిరంతరం నీటిని కోల్పోతుంటుంది. కానీ వేసవిలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మన మెదడు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి (Thermoregulation) చెమట గ్రంథులను వేగవంతం చేస్తుంది. చెమట చర్మంపై ఆవిరి అయినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఈ ప్రక్రియలో మనం విపరీతంగా నీటిని, దాంతో పాటు ఎలక్ట్రోలైట్లను అంటే సోడియం, పొటాషియం కోల్పోతాము.

నీటి సమతుల్యత దెబ్బతినడం..  

 మనం కోల్పోయే నీటి కంటే, తాగే నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు శరీరం లోపల 'ద్రవాల లోటు' ఏర్పడుతుంది. మన శరీరంలో కేవలం 1 నుంచి 2శాతం నీరు తగ్గినా దాహం వేయడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్జలీకరణం ఎందుకు ప్రమాదకరం..?

శరీరంలో నీరు తగ్గగానే రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంపింగ్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి తల తిరగడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది.

వ్యాధిగ్రస్తులకు ముప్పు.. 

మధుమేహం, బీపీ ఉన్నవారిలో ఇది కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వారు త్వరగా ప్రమాదంలో పడతారు.

జాగ్రత్తలు..ఏం చేయాలి..?

కేవలం దాహం వేసినప్పుడే కాదు, వేసవిలో క్రమం తప్పకుండా నీరు తాగుతుండాలి. కేవలం మంచినీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) తీసుకోవడం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి.

పండ్లు,కూరగాయలు.. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. మూత్రం రంగు పసుపు పచ్చగా వస్తోందంటే మీరు డీహైడ్రేషన్ బారిన పడ్డారని అర్థం. వెంటనే నీటి శాతం పెంచాలి. మన శరీరం ఒక యంత్రం అయితే, నీరు దానికి ఇంధనం లాంటిది. యంత్రం వేడెక్కినప్పుడు ఇంధనం త్వరగా ఖర్చవుతుంది, కాబట్టి రీఫిల్లింగ్ తప్పనిసరి..!

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.