Heart Disease : గురకకు గుండె జబ్బుల ముప్పునకు ఏంటి లింక్..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాలా మంది ఇళ్లలో రాత్రి వేళల్లో 'గురక' వినపడటం సర్వసాధారణం. కొందరైతే ఇది గాఢ నిద్రకు సంకేతమని భావించి సరిపెట్టుకుంటారు. కానీ, వైద్య నిపుణుల ప్రకారం గురకను ప్రతిసారీ అంత తేలికగా తీసుకోకూడదు. ముఖ్యంగా రాత్రిపూట విపరీతంగా, గట్టిగా పెట్టే గురక తీవ్రమైన గుండె జబ్బులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

నిద్రలో శ్వాస ఆగుతోందా..? అయితే ప్రమాదమే..!

రాత్రి పడుకున్నప్పుడు గురకతో పాటు కొద్ది సెకన్ల పాటు శ్వాస ఆగిపోయి, ఆ తర్వాత అకస్మాత్తుగా ఊపిరి భారంగా అందుతుంటే.. అది సాధారణ గురక కాదు. వైద్య పరిభాషలో దీనిని 'అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' (OSA) అని పిలుస్తారు. నిద్రపోతున్నప్పుడు గొంతులోని కండరాలు వదులై శ్వాస మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శరీరానికి, ముఖ్యంగా మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే.. అధిక రక్తపోటు (bp), పక్షవాతం (stroke)గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..

రాత్రి 7 నుంచి 8 గంటలు పడుకున్నప్పటికీ.. ఉదయం లేవగానే ఉత్సాహం లేకపోవడం, రోజంతా నీరసంగా, నిద్రమత్తుగా అనిపించడం ప్రధాన లక్షణం. రాత్రి వేళల్లో గురక వల్ల నిద్రకు పదేపదే అంతరాయం కలగడమే దీనికి కారణం. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను దెబ్బతీయడమే కాకుండా.. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రమాదాలకు దారితీస్తుంది. నిద్రలేవగానే తల బరువుగా ఉండటం లేదా తలనొప్పి రావడం కూడా స్లీప్ అప్నియా సంకేతమే. రాత్రంతా ఆక్సిజన్ సరిగ్గా అందక, శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడం వల్ల ఉదయాన్నే తలనొప్పి వేధిస్తుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..? 

గురక ప్రతిరోజూ వస్తూ, చాలా బిగ్గరగా ఉన్నప్పుడు.. నిద్రలో ఊపిరాడనట్లు అనిపించినా లేదా శ్వాస ఆగిపోతున్నట్లు పక్కనున్న వారు గమనించినా వెంటనే స్లీప్ డిజార్డర్ నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

గురక నివారణకు ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? 

ప్రాథమిక దశలోనే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల గొంతు భాగంలో కండరాల ఒత్తిడి తగ్గుతుంది.
 వెల్లకిలా పడుకోకుండా.. పక్కకు తిరిగి అంటే ఎడమ లేదా కుడి వైపునకు పడుకునే అలవాటు చేసుకోవాలి.

 రాత్రి నిద్రపోయే ముందు ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లను పూర్తిగా మానుకోవాలి. శ్వాస సరిగ్గా ఆడనివ్వని ముక్కు దిబ్బడ లేదా సైనస్ సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.
 నిత్యం శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీర కండరాలు దృఢంగా మారి నిద్ర సక్రమంగా పడుతుంది. అది శరీరం పంపే ఆరోగ్య హెచ్చరిక. కాబట్టి గురకను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో స్పందించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

 

 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.