Chia Seeds vs Sabja Seeds : బరువు తగ్గడానికి..? చియా గింజలు .. సబ్జా గింజలు.. ఏవి బెటర్..?

సాక్షి లైఫ్: నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో 'సూపర్ ఫుడ్స్' వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో చియా గింజలు లేదా సబ్జా గింజలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇవి రెండూ నీటిలో వేయగానే ఉబ్బి, జెల్లీలా మారతాయి. అయితే, వీటిలో బరువు తగ్గడానికి ఏవి ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

 

చలువ..

సబ్జా గింజల్లో కరిగే పీచు పదార్థం (Soluble Fiber) అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన ఆకలిని నియంత్రిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. సహజంగానే చలువ చేసే గుణం ఉన్న సబ్జా, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

శక్తినిచ్చేవి..

చియా గింజలు పోషకాల గని. వీటిలో ఫైబర్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజం రేటును పెంచి, కొవ్వు కరగడానికి దోహదపడతాయి. కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ వీటిలో లభిస్తుంది. వ్యాయామం చేసే వారికి ఇది శక్తినివ్వడమే కాకుండా పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది.

ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటి మరి..?

కేవలం శరీరాన్ని చల్లబరుస్తూ, ఆకలిని నియంత్రించాలంటే సబ్జా మేలు. అయితే, వ్యాయామం చేస్తూ శరీరానికి తగిన పోషణ ఇస్తూ బరువు తగ్గాలనుకుంటే చియా గింజలు ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఎలా తీసుకోవాలి..?

ఒక గ్లాసు నీటిలో చెంచా సబ్జా గింజలను 15 నిమిషాల పాటు నానబెట్టి, కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి 'డిటాక్స్ డ్రింక్'లా తీసుకోవచ్చు. చియా గింజలు రాత్రంతా నానబెట్టి ఉదయం స్మూతీలు, పెరుగు లేదా ఓట్స్‌లో కలిపి తీసుకోవడం వల్ల పూర్తి స్థాయి ఫలితం ఉంటుంది. ఏవైనా గింజలు తీసుకునేటప్పుడు రోజుకు ఒకటి లేదా రెండు టీస్పూన్లు మాత్రమే తీసుకోవాలి. వీటితో పాటు రోజంతా తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : chia-seeds weight-loss weight-lose weight weight-loss-tips lose-weight-foods weight-management
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com