High Triglycerides : ట్రైగ్లిజరైడ్స్  ఈ సమస్య ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు (fat). మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అందే అదనపు కేలరీలను.. భవిష్యత్తులో శక్తిగా వాడుకోవడం కోసం ట్రైగ్లిజరైడ్స్ రూపంలో శరీరం నిల్వ చేస్తుంది. ఇవి సాధారణ స్థాయిలో ఉంటే శరీరానికి అవసరమే. కానీ, పరిమితికి మించి పెరిగితే మాత్రం రక్తనాళాల్లో (arteries) కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం (stroke) రావడమే కాకుండా, కొన్నిసార్లు ప్యాంక్రియాస్‌కు వాపు వచ్చే 'ప్యాంక్రియాటైటిస్' ముప్పు కూడా పెరుగుతుంది.

 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ఈ సమస్య ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఉంటాయా..?

దీనిని 'సైలెంట్ కిల్లర్' (silent killer) అని అంటారు. ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు పైకి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. సాధారణ రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే ఈ విషయం బయటపడుతుంది.

ప్రధాన కారణాలు..

శారీరక శ్రమ లేకపోవడం,గంటల తరబడి కూర్చునే ఉండటం.ఊబకాయం లేదా అధిక బరువు. నియంత్రణలో లేని మధుమేహం. మోతాదుకు మించి మద్యం సేవించడం, ధూమపానం.
థైరాయిడ్ లేదా ఫ్యాటీ లివర్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు.

ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే వెంటనే ఏం చేయాలి..?

మీ రక్త పరీక్షలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఆందోళన చెందకుండా, వెంటనే జీవనశైలిలో ఈ కింది మార్పులు చేసుకోవాలి:

1. ఆహారపు అలవాట్లలో మార్పులు..  

 స్వీట్లు, శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మైదాతో చేసిన బేకరీ వస్తువులు, వైట్ బ్రెడ్ వంటి వాటి వాడకాన్ని బాగా తగ్గించాలి. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ జోలికి వెళ్లకూడదు.

 తృణధాన్యాలు (millets), పొట్టుతో ఉన్న పప్పులు, తాజా ఆకుకూరలు, పండ్లు, పీచు (fiber) పదార్థాలు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..

చేపలు, అవిసె గింజలు (Flaxseeds), వాల్‌నట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ వేగంగా తగ్గుముఖం పడతాయి.

2. శారీరక శ్రమ తప్పనిసరి.. 

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్, లేదా ఈత కొట్టడం లాంటివి అలవాటు చేసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు తమ శరీర బరువులో కనీసం 5 నుంచి 10 శాతం బరువు తగ్గినా ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటు అదుపులోకి వస్తాయి.

 మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్, ఊబకాయం ఉన్నవారు ఈ సమస్య పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 20 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా 'లిపిడ్ ప్రొఫైల్' పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. జీవనశైలి మార్పులతోనూ సమస్య అదుపులోకి రాకపోతే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.